పీఎస్‌ఎల్‌వీ సీ48 రాకెట్‌ ప్రయోగం

Published: Wednesday December 11, 2019

 à°ªà±€à°Žà°¸à±‌ఎల్‌వీ సీ48 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. à°ˆ ప్రయోగంతో రీశాట్‌-2 బీఆర్‌1 స్వదేశీ ఉపగ్రహంతో పాటు.. 9 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికా ఆరు, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం కక్ష్యలోకి చేరాయి. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 50à°µ రాకెట్‌ ప్రయోగం కాగా, శ్రీహరికోటలో 75à°µ ప్రయోగం. రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం బరువు 628 కేజీలు. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వాహణ రంగాలకు రీశాట్‌ సేవలను వినియోగించనున్నారు. ఐదేళ్లపాటు రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం సేవలు అందించనున్నది. రీశాట్‌-2బీకి కొనసాగింపుగా రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ సీ48 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ శివన్ సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.