నేటి నుంచి 24 గంటలూ అందుబాటులోకి నెఫ్ట్ సేవలు

Published: Monday December 16, 2019
ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నగదు పంపేందుకు సమయం చూసుకోనక్కర్లేదు. క్యాలెండర్ వంక చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేటి నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ.. 365 రోజులూ నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చాయి. ఇన్నాళ్లూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6.30 à°—à°‚à°Ÿà°² వరకే నెఫ్ట్ ద్వారా నగదు బదిలీకి అవకాశముండేది.
 
అయితే.. ఆర్బీఐ ఈ పరిమిత విధానానికి స్వస్తి పలికింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో కూడా నెఫ్ట్ ద్వారా నగదును ఏ క్షణమైనా బదిలీ చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిసింది. మరో శుభవార్త ఏంటంటే... ఇప్పటికే నెఫ్ట్, ఆర్టీజీఎస్ విధానాల్లో జరిగే నగదు బదిలీలపై చార్జీలను ఆర్బీఐ ఎత్తివేసింది.