3 వేల వృద్ధాప్య పింఛను ఏదీ?

Published: Tuesday December 17, 2019
 à°µà±ˆà°¸à±€à°ªà±€à°¨à°¿ నమ్మి ఓటు వేసినందుకు పింఛన్‌ కోసం ఎదురుచూసే వృద్ధులు భారీగా నష్టపోయారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్‌ 2 వేల నుంచి 3 వేలకు పెంచుతామని చెప్పిందని గుర్తుచేశారు. ‘పెన్షన్‌ అమలులో వైసీపీ ప్రభుత్వం అంచెంచెలుగా మాట తప్పుతోందనాలా.. లేక మోసం చేస్తోందనుకోవాలా..’ అని సోమవారం ట్విటర్‌లో అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ను రూ.2,250 మాత్రమే చేసిందని.. దీనివల్ల ప్రతి లబ్ధిదారూ నెలకు రూ.750 నష్టపోతున్నారని తెలిపారు.
 
 
అలాగే వృద్ధాప్య పెన్షన్‌ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని ప్రభుత్వం మే 30à°¨ జీవో 103 జారీచేసిందని.. కానీ ఈరోజు వరకూ రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయలేదని ఆక్షేపించారు. పెన్షన్‌ వయస్సు తగ్గిస్తే కొత్తగా 10 లక్షల మందికి పింఛను ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నెలకు ఇస్తున్న రూ.2,250 లెక్కన చూసుకుంటే, ఒక్కో కొత్త పింఛన్‌ లబ్ధిదారు ఏడు నెలల వ్యవధిలో 15,750 వరకూ నష్టపోయినట్లు పేర్కొన్నారు.