త్వరలో రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

Published: Saturday December 28, 2019
‘‘ప్రజలు మన నుంచి చాలా ఆశిస్తున్నారు. నాణ్యమైన విద్యను, పాఠ్యప్రణాళికలో కుదింపును, అన్ని ప్రైవేటు పాఠశాల ల్లో ఫీజుల తగ్గింపును వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వం à°† దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. వచ్చే వి ద్యా సంవత్సరానికే మార్పు కన్పించాలి’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అదేసమయంలో అన్ని పాఠశాలల్లోనూ విద్యా హక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాన్ని à°’à°• యూనిట్‌à°—à°¾ తీసుకుని, స్కూళ్ల పరిస్థితులను సమీక్షించాలన్నారు.
 
‘‘స్కూళ్లలో ఫీజులు సాధారణ స్థాయిలో లేవు. షాక్‌ కొట్టే రీతిలో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నాటికి à°ˆ ఫీజులు తల్లిదండ్రుల అభిలాష, స్థాయిల మేరకు తగ్గాలి. à°† దిశగా అధికారులు తక్షణమే చర్య లు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. à°ˆ మేరకు శుక్రవారం ఆయన ప్రైవేట్‌ కాలేజీలు, స్కూళ్లు, విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణపై సంబంధింత మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు(రిటైర్డ్‌), ఏపీ ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య(రిటైర్డ్‌) తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ప్రభుత్వ స్కూళ్లు తెలుగు మీడియంలో నడుస్తున్నందున చిన్నారుల భవిష్యత్తుపై బెంగతో వారి తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయించి, అప్పులు కూడా చేసి ఖర్చు పెడుతున్నారని సీఎం జగన్‌ అన్నారు. à°ˆ నేపథ్యంలోనే ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంకు మొగ్గు చూపిందని వివరించారు. ఇంగ్లీషు మీడియం చదువులు పేదవాళ్లకు చేరువ అయితేనే వ్యవస్థలో మార్పులు వస్తాయని తాను నమ్ముతున్నట్టు సీఎం చెప్పారు. à°’à°• వైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతూనే, మరోపక్క ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దూకుడుకు ముకుతాడు వేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. నియోజకవర్గాన్ని యూనిట్‌à°—à°¾ తీసుకుని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.