ఇరాన్‌కు మరో ఝలక్?

Published: Tuesday January 07, 2020
అమెరికా-ఇరాన్‌à°² మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌‌లోని 52 లక్ష్యాలకు గురిపెట్టాం అని ట్రంప్ హెచ్చరించగా.. ఏకంగా అమెరికా అధ్యక్షుడి తలపైనే ఇరాన్ రివార్డు ప్రకటించింది. à°ˆ నేపథ్యంలో గురువారం న్యూయార్క్‌లో జరగనున్న భద్రతా మండలి సమావేశంపైనే అందరిదృష్టీ కేంద్రీకృతమై ఉంది. à°ˆ సమావేశానికి ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహ్మద్ జావేద్ జారిఫ్‌ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈలోపు అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  సమావేశం కోసం అమెరికాలో అడుగుపెట్టేందుకు జారిఫ్‌కు వీలులేకుండా ఆయనకు ప్రభుత్వం వీసా నిరాకరించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని à°“ అధికారి తెలిపారు.
 
అయితే అమెరికా à°ˆ నిర్ణయాన్ని à°…ధికారికంగా ప్రకటించలేదు. అమెరికా ప్రతినిధి స్టెఫానీ జురాక్ మాత్రం à°ˆ విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. కాగా.. వీసా నిరాకరణ నిజమని తేలిన పక్షంలో అమెరికా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ కార్యాలయాలు అమెరికాలో ఉన్న నేపథ్యంలో విదేశీ దౌత్యవేత్తలకు కచ్చితంగా వీసా ఇవ్వాల్సి ఉంటుందని 1947 నాటి హెడ్‌క్వార్టర్స్ ఒప్పందం స్పష్టం చేస్తోందని వారు చెబుతున్నారు. కానీ అమెరికా వర్గాలు మాత్రం మరో వాదన ముందుకు తెస్తున్నాయి. అమెరికా భద్రత, విదేశీ విధానం వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విదేశీ దౌత్యవేత్తలకు వీసా నిరాకరించే హక్కు అమెరికాకు ఉందని వారు తేల్చిచెబుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్ దౌత్యవర్గాలు కూడా స్పందించాయి. అమెరికా నుంచి గానీ, ఐక్యరాజ్య సమితి నుంచి గానీ తమకు వీసా విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని తెలిపాయి. దీంతో వీసా విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.