‘‘నేనెవరిని.. శోభగారి మేనల్లుడిని

Published: Thursday January 16, 2020
‘‘నేనెవరిని.. శోభగారి మేనల్లుడిని.. తలుచుకుంటే ఏమైనా చెయ్యగలను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కష్టమర్‌నే దింపేశారు. సీఎం అల్లుడిని నేను.. దొంగను కాదు. కోర్టులో కేసు వేసినా.. నేనే గెలుస్తా. జీవో తీద్దాం. కోర్టు ఏమడుగుతుంది? పత్రాలు సరిగ్గా ఉన్నాయా.. చలానాలు ఉన్నాయా అని అడుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా అనుమానితులు ఉంటే.. వాడు దొంగా.. లేదా అన్నది తెలుసుకోవడానికి పోలీస్ స్టిక్కర్ బట్టి తెలుస్తుంది. సీఎం గారు చెప్పారండి. చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. యాక్చువల్‌à°—à°¾ సీఎం ఆఫీసు స్టిక్కర్ తీసుకుందామనుకున్నా.. కమర్షియల్ వెహికిల్ కాబట్టి ఇవ్వలేదు.’’
 
 
 
ఈ మాటలంటోంది ఓ కారు డ్రైవర్. ట్రాఫిక్ పోలీసులపై వీర లెవల్లో రెచ్చిపోయాడు. సీఎం కేసీఆర్ సతీమణి.. శోభ మేనల్లుడినంటూ పోలీసులనే బెదిరించే ప్రయత్నం చేశాడు. గురువారం ఉదయం నగరంలోని నేరెడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నెరెడ్మెట్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి ఎలాంటి పత్రాలు లేకుండా టీఎస్16యూబీ5620 అనే నంబర్ వాహన నడుపుతూ దొరికాడు. పత్రాలు అడిగితే... తలుచుకుంటే ఏమైనా చేస్తానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. వాహనం రిక్కా జాకోబ్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయ్యి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.