ఉగ్రవాది ఇంట్లో శ్రీనగర్ ఆర్మీ మ్యాప్ లభ్యం

Published: Thursday January 16, 2020
 à°–ాకీ ఉగ్రవాది దవీందర్ సింగ్ ఇంట్లో శ్రీనగర్ భారత సైనిక హెడ్‌క్వార్టర్స్ 15 కార్ప్స్ మ్యాప్‌తోపాటు పలు కీలక డాక్యుమెంట్లు దొరకడం సంచలనం రేపింది. à°¹à°¿à°œà±à°¬à±à°²à± ముజాహిదీన్ ఉగ్రవాదులను కారులో తరలిస్తూ పట్టుబడిన శ్రీనగర్‌ విమానాశ్రయ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ ఇంట్లో తనిఖీలు జరిపిన సైనికాధికారులకు ఆర్మీ మ్యాప్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు దొరికాయి. దవీందర్ సింగ్ à°ˆ నెల 11వతేదీన తన ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని జమ్మూకశ్మీర్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీనగర్ నగరంలోని బదామీ బాగ్ కంటోన్మెంటులోని ఆర్మీ 15 కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఖాకీ ఉగ్రవాది దవీందర్ సింగ్ ఇల్లు ఉంది. తన ఇంట్లోనే ఉగ్రవాదులకు దవీందర్ ఆశ్రయం కల్పించాడని దర్యాప్తులో తేలడంతో ఆర్మీ అధికారులు షాక్‌కు గురయ్యారు.
 
దవీందర్ ఇంట్లో సోదాలు జరిపిన ఆర్మీ అధికారులకు లెక్క తేలని రూ.7.5 లక్షలు లభించాయి. కశ్మీర్ రాష్ట్రంలో ఉన్న దవీందర్ బంధువుల ఇళ్లలోనూ కేంద్ర భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. శ్రీనగర్ నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో దవీందర్ విలాసవంతమైన భవనం నిర్మించాడని దర్యాప్తులో వెల్లడైంది. శ్రీనగర్ నగరంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ప్రహరీగోడ ఆనుకొని దవీందర్ 2017 వ సంవత్సరం నుంచి విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నాడని తేలింది. దవీందర్ సొంత భవనం నిర్మాణంలో ఉండటంతో అతని బంధువు ఇంట్లో గత ఐదేళ్లుగా అద్దెకు నివాసముంటున్నాడని దర్యాప్తులో వెల్లడైంది.
 
గతంలో ఇతని ఇంట్లో రెండు పిస్టళ్లు, à°’à°• ఏకే 47 రైఫిల్, పెద్దఎత్తున తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దవీందర్ కు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై సరైన సమయంలో వివరాలు వెల్లడిస్తామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ చెప్పారు.à°ˆ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు వీలుగా దర్యాప్తు బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించామని డీజీపీ దిల్‌బాగ్‌సింగ్ వివరించారు.