నిర్భయ దోషికి ఉరే సరి

Published: Friday January 17, 2020
నిర్భయ హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించిన సంగతి విదితమే. à°ˆ నేపథ్యంలోనే రాష్ట్రపతి నిందితుడి క్షమాభిక్షను తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. à°ˆ సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు. ‘‘చాలా మంచి విషయం. ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త తమ ఆశలను ఆవిరి చేసింది’’ అని తండ్రి పేర్కొన్నారు.
 
 à°¨à°¿à°°à±à°­à°¯ కేసులో నలుగురు దోషులను ఉరి తీస్తామని ప్రకటించిన తర్వాత ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఆయన క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఆయన ఉరి శిక్షను వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కారాగార నిబంధనల ప్రకారం కేసులో ఉన్నవారు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకుంటే అది తేలే వరకు శిక్ష అమలు చేయడం కుదరదని పేర్కొంది. దీంతో నిర్భయ దోషులను ఉరిశిక్షపై కొంత సందిగ్ధత ఏర్పడింది. రాష్ట్రపతి కోవింద్ చేసిన తాజా ప్రకటనతో ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారో తేలాల్సి ఉంది.