సంచలన విషయం వెల్లడించిన ట్రంప్

Published: Sunday January 19, 2020
అమెరికా డ్రోన్ ఆపరేషన్‌లో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ ఎలా మృతి చెందిందీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ వివరించారంటూ à°“ అమెరికా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం నిధులు సమీకరించేందుకు ఇటీవల ఏర్పాటైన కార్యక్రమంలో ట్రంప్ అక్కడికి వచ్చిన ఆహుతులతో à°ˆ వివరాలు పంచుకున్నారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ తమ వద్ద ఉందని తెలిపింది.
 
‘సర్.. వాళ్లందరూ ఒకే కారులో ఉన్నారు. ఇక వాళ్లకి 2 నిమిషాల 11 సెకెన్లే మిగిలి ఉన్నాయి. ఇక వాళ్లకు మిగిలింది 1 నిమిషం 11 సెన్లే.. సర్. 30 సెకెన్లు... 9, 8, 7..’ అంటూ మిలటరీ అధికారులు ఎప్పటికప్పుడు తనతో సమాచారం పంచుకున్నారని ట్రంప్ ఆహుతులతో అన్నారు. à°† తరువాత ‘బూమ్’ అంటూ పెద్ద శబ్దం వినబడిందని ఆయన అన్నారు. అనంతరం.. టార్గెట్ పూర్తైందని à°“ మిలటరీ అధికారి చివరిగా తనకు చెప్పారని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు పత్రిక చెప్పుకొచ్చింది. à°ˆ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
 
మరోవైపు.. ఖాసిం మృతిపై అమెరికాలో మరో వివాదం చెలరేగింది. ఖాసిం వల్ల అమెరికన్లకు ప్రమాదమని ప్రకటించిన ట్రంప్.. అందుకు సంబంధించిన వివరాలు బహిరంగంగా వెల్లడించకపోవడంపై కొందరు సెనెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాపై ఖాసిం నోరు పారేసుకోవడంతోనే అతడిని టార్గెట్ చేసుకున్నామని ట్రంప్ అన్నట్టు వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది.