శ్రీవారి లడ్డూ రాయితీకి స్వస్తి.. ప్రతి భక్తునికీ ఒక లడ్డూ ఉచితం

Published: Monday January 20, 2020
శ్రీవారి భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదంపై టీటీడీ ఇస్తున్న రాయితీ నిలిచిపోయింది. ఆదివారం అర్ధరాత్రి 12 à°—à°‚à°Ÿà°² నుంచి రాయితీ నిలిపివేత అమల్లోకి వచ్చింది. దీంతో ప్రతి భక్తుడికీ à°’à°• లడ్డూను ఉచితంగా ఇస్తూ, అదనంగా కావాలనుకునే వారికి ఒక్కొక్క లడ్డూను రూ.50à°•à°¿ విక్రయిస్తున్నారు. లడ్డూ రాయితీ రద్దుపై భక్తుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ‘నష్ట నివారణ చర్య’ పేరుతో టీటీడీ తన నిర్ణయం మేరకే ముందుకు సాగింది. నూతన విధానం 20 తేదీ నుంచి అమలవుతుందని గతంలోనే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిమితి లేకుండా భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే, ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్‌ వరకు విడుదల చేసిన ఆర్జిత సేవలు, రూ.300 టికెట్లపై మాత్రం ఇప్పుడున్న రాయితీ విధానంలోనే లడ్డూలు ఇస్తారు. మే నుంచి ఆన్‌లైన్‌ కోటాలోనూ కొత్త విధానాన్ని అమలు చేస్తారు.
 
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, సోమవారం నుంచి ఉచిత లడ్డూ పథకం.. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్లు, శ్రీవాణిట్రస్టు, వీఐపీ, వారపుసేవలు తదితర అన్ని విధానాల్లో దర్శనం చేసుకున్న భక్తులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కొండకు నడిచి వచ్చే 20 వేల మంది భక్తులకు మాత్రమే రూ.40 విలువ చేసే 175 గ్రాముల లడ్డూను ఉచితంగా ఇస్తున్నామని, ఇక, నుంచి అందరికీ à°’à°• లడ్డూ ఉచితంగా ఇస్తామని చెప్పారు. అదనపు లడ్డూల విక్రయానికి ప్రత్యేకంగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం సిఫారసు లేఖలపై శ్రీవారి ఆలయం లోపల వగపడి కౌంటర్‌లో మాత్రమే విక్రయిస్తున్న పెద్దలడ్డూలు, వడల విక్రయాలను కూడా సోమవారం నుంచి బయట లడ్డూ వితరణశాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ అధికారుల అనుమతితో సిఫారసులపైనే వీటిని ఆలయం బయట 44à°µ నంబరు కౌంటర్‌లో విక్రయిస్తామన్నారు.