బడిలో పోలీసులు... చెట్లకింద విద్యార్థులు

Published: Thursday January 23, 2020
తరగతి గదుల్లో పోలీసులు బస చేశారు. అక్కడ కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులేమో చెట్ల పాలయ్యారు. ఇది రాజధాని గ్రామం మందడంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పరిస్థితి. మూడు రాజధానులపై రైతులు, స్థానికులు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనల అణచివేతకు భారీ సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. మందడం జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లో పోలీసులకు వసతి కల్పించారు.
 
సంక్రాంతి సెలవులు ఉన్నంత వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. మంగళవారం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయినప్పటికీ పోలీసులు తరగతి గదులను ఖాళీ చేయలేదు. బుధవారం విద్యార్థులను నేలపై, చెట్లకింద కూర్చోబెట్టి టీచర్లు పాఠాలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పాఠశాల తెరుచుకున్న తర్వాత పోలీసులకు వసతి ఎలా ఇచ్చారని టీచర్లను ప్రశ్నించారు. విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
 
ఉపాధ్యాయులు నీళ్లు నమిలి అలాంటిదేమీ లేదని, తరగతి గదుల్లోనే పాఠాలు చెబుతున్నామని తెలిపారు. అదే సమయంలో కొందరు పోలీసులు అక్కడకు చేరుకొని ఎందుకు వివాదం చేస్తున్నారని గ్రామస్థులను గట్టిగా అడిగారు. ‘‘సెలవు రోజుల్లో ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. చెట్లకింద కూర్చోబెడుతున్నారని విద్యార్థులు చెబితే అడగడానికి వచ్చాం’’ అని స్థానికులు వివరించారు. ‘ఎవరు చెప్పారు? వాళ్లను చూపించండి’ అంటూ పోలీసులు బెదిరింపు స్వరంతో గ్రామస్థులను ప్రశ్నించారు.
 
‘మీ సంస్థలకు త్వరలోనే నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటాం’ అని మీడియా ప్రతినిధులనూ బెదిరించారు. జరుగుతున్న విషయాలనే చూపిస్తున్నామని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు. చెట్ల à°•à°¿à°‚à°¦ ఉన్న పిల్లల్ని హుటాహుటిన లోపలికి పంపించి... మీడియాను ఎందుకు అనుమతించారంటూ ఉపాధ్యాయులపైనా పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.