బడ్జెట్‌ నిరాశ కలిగించింది : బుగ్గన

Published: Sunday February 02, 2020
కేంద్ర బడ్జెట్‌ అంతా ప్రశ్నార్థకంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, నిధుల విడుదలలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. రాష్ర్టానికి కీలకమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌ్‌సలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యాసంస్థలకు, à°•à°¡à°ª ఉక్కు పరిశ్రమకు నిధులు, వెనుకబడిన 7 జిల్లాలకు ప్యాకేజీని కేంద్ర బడ్జెట్‌ విస్మరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దుగరాజపట్నం రేవునూ పట్టించుకోలేదన్నారు.
 
ఆర్థికమాంద్యం వల్ల రెవెన్యూ రాబడులు రావడం లేదని, రాష్ట్రం రూ.19వేల కోట్ల రెవెన్యూలోటులో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ర్టానికి ఇబ్బందికర పరిస్థితి నెలకొందని బుగ్గన ఆందోళన వ్యక్తం చేశారు. గోదాముల సామర్థ్యం పెంచడం, ధాన్యలక్ష్మి, కోడ్‌ సప్లయ్‌ చైన్‌, కృషీ ఉడాన్‌, హార్టికల్చర్‌తో పాటు 112 జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ వంటి పథకాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
 
 à°¶à°¾à°¸à°¨à°¸à°­ నిర్ణయాన్ని అడ్డుకుంటామని, మండలిలో తమకు అధికారం ఉందని పదేపదే యనమల బృందం చేసిన ప్రకటనలే మండలి రద్దుకు కారణమయ్యాయని బుగ్గన చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆమోదం శాసనసభకు మాత్రమే ఉందని, మండలికి లేదన్నారు. ‘వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్‌ వద్దన్న తుగ్లక్‌లు ఎవరు? ప్రభుత్వ డబ్బుతో నవనిర్మాణ దీక్ష చేసిన తుగ్లక్‌లు ఎవరు? మీరే తుగ్లక్‌.. దుర్మార్గ తుగ్లక్‌లు. విభజన కారకులే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పాపిష్టి పనులన్నీ చేసి మా మీద దుమ్మెత్తిపోస్తే ఏం వస్తది’ అని ప్రశ్నించారు.