విశాఖకైతే అన్ని అర్హతలూ ఉన్నాయి

Published: Thursday February 06, 2020
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ ఐదేళ్లు ఉన్నా పరిస్థితి మారదని.. అలాంటప్పుడు ఏం చేయాలని నిలదీశారు. బుధవారం విజయవాడలో జరిగిన à°“ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. à°ˆ సందర్భంగా అమరావతి, మూడు రాజధానులు, తన ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ‘లక్ష కోట్లు పెట్టుబడి పెడితే 20 ఏళ్ల తర్వాత తడిసి మోపెడై రూ.3లక్షల కోట్లవుతాయి.
 
అమరావతిలో ల్యాండ్‌బ్యాంకింగ్‌ చాలా ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్జీటీ నిబంధనల ప్రకారం పరిధి మినహాయిస్తే, నికరంగా ఉన్న భూమి 5,200 ఎకరాలు మాత్రమే. à°ˆ భూమి ద్వారా లక్ష కోట్లు రావాలంటే.. అదే 20ఏళ్ల తర్వాత 3-4లక్షల కోట్లు కావాలంటే à°Žà°•à°°à°‚ దాదాపు రూ.90కోట్లకు అమ్మాలి. ఇది సాధ్యమేనా’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి à°’à°• తండ్రిగా తనవంతుగా శాయశక్తులా న్యాయం చేస్తున్నానన్నారు. అమరావతి రాజధాని కోసం 53వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించారని, అక్కడ కనీస మౌలిక సదుపాయాలూ లేవన్నారు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలంటే.. à°—à°¤ ప్రభుత్వ నివేదికల ప్రకారం ఎకరాకూ రూ.2 కోట్లు ఖర్చవుతాయని.. 53వేల ఎకరాలకు రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. à°—à°¤ ప్రభుత్వం à°—à°¡à°šà°¿à°¨ ఐదేళ్లలో రూ.5,677 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని.. ఇంకా తమ ప్రభుత్వంపై సుమారు రూ.2,300 కోట్లు భారం వేసి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు.
 
చేసిన పనులకు కూడా 10.32శాతం వడ్డీతో అప్పుతెచ్చారని.. కేంద్రం 1,500కోట్లు ఇచ్చిందని.. అందుకే ఇక్కడ పెట్టుబడి కోసం తప్పనిసరిగా రుణాలకు వెళ్లాల్సిందేనని జగన్‌ చెప్పారు. à°ˆ పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకుంటే వచ్చే తరాలకు అన్యాయం, నష్టం జరుగుతాయన్నారు. ‘అమరావతి.. విజయవాడకు గానీ, గుంటూరుకు గానీ దగ్గరగా లేదు. అక్కడకు కనీసం డబుల్‌రోడ్‌ లేదు. అంతా సింగిల్‌ రోడ్డే. అయినా ఆయన(చంద్రబాబు)కు à°† ప్రాంతం పై ఎందుకంత ఆసక్తిఅంటే.. అందరికీ తెలుసు. ఆయనకు, ఆయన అనుయాయులకు అక్కడ ఎన్నో భూములున్నాయి’ అని ఆరోపించారు. అమరావతిలో కనీస సదుపాయాల కోసం ఇంకా 1.06 లక్షల కోట్లు కావాలని.. కానీ ఆరు వేల రూపాయల కోట్లకు మించి ఖర్చు చేసే పరిస్థితి లేదని జగన్‌ స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. à°† వ్యయమంతా సముద్రంలో నీటి బొట్టు మాదిరిగా ఉంటుందన్నారు.