బీజేపీ అజెండాకు ఎదురుదెబ్బ.. ఫలించని మోదీ-అమిత్‌ షా వ్యూహం

Published: Wednesday February 12, 2020

 

‘‘మేం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చాం. ఇందుకు పార్లమెంట్‌ను గౌరవించాలి, అభినందించాలి. ఎన్నార్సీ దిశగా ఇది మరో అడుగు.. అని కొందరంటున్నారు. 2014 నుంచి నేటిదాకా మేం ఎన్నార్సీ గురించి మాట్లాడలేదు. పార్లమెంట్లో ఏ బిల్లూ ప్రవేశపెట్టలేదు. కేబినెట్లో చర్చించలేదు. దేశంలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలూ (డిటెన్షన్‌ సెంటర్స్‌) పెట్టలేదు.. విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి’’.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబరు 22à°¨ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ప్రధాని అన్న మాటలివి. అంటే లోక్‌సభ ఎన్నికల్లో మాదిరే బీజేపీ మార్కు జాతీయవాద అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. ఇక అమిత్‌ షాదీ అదే బాట. మెట్రో నగరమైన ఢిల్లీలో 80 శాతం దాకా హిందువులుండడంతో హిందూత్వ అజెండానే బీజేపీ తన బాణంగా చేసుకుంది. ఆఖరికి అయోధ్య రామాలయ ట్రస్ట్‌ ఏర్పాటు ప్రకటనా à°ˆ ప్రచార సమయంలోనే వెలువడింది. కానీ, à°ˆ అజెండా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మితిమీరిన హిందూత్వ ప్రచారం బెడిసికొట్టిందని à°“ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయుష్మాన్‌ భారత్‌, ఉచిత కరెంటు, ఇతర సౌకర్యాలు ప్రకటించాలని బీజేపీ తొలుత భావించినా వాటిని మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆఖరికి సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇవన్నీ తమ కొంపముంచాయని, అమిత్‌ à°·à°¾ వీటిపై దృష్టి పెట్టలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

ఢిల్లీ గద్దెను బీజేపీ 1998లో కోల్పోయింది. నాడు షీలా దీక్షిత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌.. సుష్మా స్వరాజ్‌ నేతృత్వంలోని కమలదళాన్ని మట్టికరిపించింది. అప్పటి నుంచి నేటి దాకా అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిర్భవించాక కమలనాథులకు పరిస్థితి మరింత జటిలమైపోయింది. షీలా హయాంలో మొదలైన అభివృద్ధిని కేజ్రీవాల్‌ మరింత ముందుకు తీసుకెళ్లారు.  

ఢిల్లీది à°“ విచిత్రమైన పరిస్థితి. అక్కడ శాంతి భద్రతలు సహా అనేకానేక అంశాలపై కేంద్రానికే అధికారాలుంటాయి. దీన్ని అదునుగా తీసుకుని à°—à°¤ ఐదేళ్లలో మోదీ సర్కారు కేజ్రీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టింది. అన్ని అధికారాలూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో ఉండడంతో గవర్నరే అసలు సీఎంగా వ్యవహరించారు. ఇక చీఫ్‌ సెక్రటరీ, ఐఏఎ్‌సలు అంతా సహాయనిరాకరణ చేశారు. ఆఖరికి గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు వ్యతిరేకంగా గవర్నర్‌ బంగ్లాలోనే కేజ్రీవాల్‌ రాత్రంతా ధర్నా చేశారు. అయినా మోదీ సర్కారు కేజ్రీ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూనే వచ్చింది. దీన్ని ప్లస్‌ పాయింట్‌à°—à°¾ మల్చుకొని కేజ్రీ ప్రజల మనసులకు చేరువయ్యారు. 

దాదాపు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ ప్రయోగించింది. కేంద్రం ఆప్‌ నేతలపై సీబీఐ, ఈడీ అవినీతి కేసులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆప్‌ నేతలు ఏం కోరినా మొండిచేయి చూపుతూ వచ్చాయి.