చికెన్‌, మటన్‌ తింటే వైరస్‌ సోకుతుందనేది అపోహే

Published: Thursday February 20, 2020

కోవిడ్‌-19 వైరస్‌పై అపోహలతో జిల్లాలో మటన్‌, చికెన్‌ విక్రయాలు తగ్గిపోయాయి. à°ˆ వైరస్‌ రాష్ట్రంలో ఎక్కడా లేదని తెలిసినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం అపోహలు సృష్టించే వీడియోలు, పోస్టింగ్‌లు వస్తున్నాయి. చికెన్‌, మటన్‌ తినడం వల్ల వైరస్‌ సోకుతుందనే వదంతులు వినిపిస్తున్నాయి. మాంసాహారం తినడం వల్ల వైరస్‌ సోకదని, కొన్ని పక్షులు, వైరస్‌ వచ్చిన à°’à°•à°°à°¿ నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. à°ˆ వైరస్‌ జిల్లాలో లేదని, జనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చని జనరల్‌ ఆస్పత్రి జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి à°¡à°¾.నిషాంత్‌ చెబుతున్నారు.

మాంసాహారం తినడం వల్ల కోవిడ్‌-19 వైరస్‌ సోకుతుందనే వదంతుల నేపథ్యంలో ప్రధానంగా చికెన్‌ విక్రయాలు పూర్తి స్థాయిలో పడిపోయాయి. కిలో చికెన్‌ ధర నెల ముందు రూ.180 నుంచి రూ.200 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.120 నుంచి రూ.130à°•à°¿ పడిపోయాయి. గతంలో ప్రధానమైన చికెన్‌ దుకాణాల్లో నెలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారం జరుగుతుండగా, ప్రస్తుతం రూ.50 వేలకు మించి సాగడం లేదని తెలుస్తోంది. మటన్‌ కూడా గతంలో రోజూ విక్రయాలు జరుగుతుండగా, నెల నుంచి కేవలం ఆదివారం మాత్రమే నిర్వహించాల్సి వస్తోందని, à°† రోజు కూడా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

 

చికెన్‌, మటన్‌ తినడం వలన కోవిడ్‌-19 వైరస్‌ వస్తుందనే వదంతులను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఏ ఆహారమైనా ఎక్కువగా ఉడికించుకొని తింటే ఎలాంటి రోగాలు రావని చెబుతున్నారు.

వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో 28 రోజులలోపు లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన న్యూమోనియాతో ఊపిరి పీల్చుకో వడానికి ఇబ్బందిగా ఉండడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు, కోవిడ్‌-19 లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

à°ˆ వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు. నివారణ ఒక్కటే మార్గం. ముఖ్యంగా వైరస్‌ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులతోనూ జాగ్రత్తలు అవసరం.