మీసేవా కేంద్రాలకు పార్టీల ముద్ర

Published: Sunday February 23, 2020

ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలకు కూడా పార్టీ ముద్ర వేశారు. మీసేవ కేంద్రాలు టీడీపీకి చెందినట్లుగా నోటీసులు జారీచేయడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. రెండురోజుల క్రితం జేసీ షన్మోహన్‌ ఆయా కంపెనీల జిల్లా కోఆర్డినేటర్లకు నోటీసులు జారీచేశారు. దీంతో ఆయావర్గాల్లో కలకలం రేగింది. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు వచ్చాయని కారణం చూపి తాఖీదులు ఇచ్చారు. జిల్లాలోని అన్ని మీసేవలు దళారీ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని, ప్రజల నుంచి అధికంగా వసూళ్ళు చేస్తున్నారనేది à°ˆ నోటీసుల సారాంశం...

 

మీసేవలపై పరోక్ష దాడి మొదలైంది. à°—à°¤ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా టీడీపీ కార్యకర్తలకు మీసేవ కేంద్రాలు మంజూరుచేశారని, వారిలో ఎక్కువమంది ప్రాంతాలనుబట్టి ఒక్కొక్క కేంద్రాన్ని రూ.5లక్షల వరకు అమ్ముకున్నారని నోటీసులు ఆయా నెట్‌వర్క్‌à°² కోఆర్డినేటర్లకు నోటీసులు జారీచేశారు. బినామీలు మీసేవా కేంద్రాలను నడుపుతున్నారని, ఏపీఆన్‌లైన్‌ సీఎంఎస్‌, ఏపీ ఆన్‌లైన్‌, రమిఇన్పో, ఈసేవ, కార్వే, సీఎస్‌సీ శ్రీవేన్‌, హెచ్‌సిఎల్‌లు టీడీపీ పార్టీకి చెందిన బినామీ కంపెనీలుగా à°† నోటీసుల్లో పేర్కొనడంతో అర్థం కానిపరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్దేశించిన చలానా రూ.45లో అందులో రూ.35 ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అయితే à°† డబ్బులను టీడీపీ కంపెనీలు అప్పనంగా దోచుకుంటున్నారని నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డులలో వయస్సును పెన్షన్‌ కోసం మార్పులు చేస్తున్నారని, అధిక మొత్తంలో నగదు రూ.5 నుంచి 10 వరకు వసూళ్ళు చేస్తున్నారనీ, మీసేవ ఆపరేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్జీదారులు కోరుతున్నట్లు à°† నోటీసుల్లో పొందుపర్చారు. నోటీసులకు 15 రోజుల్లో సంయుక్త కలెక్టర్‌ కార్యాలయంలో స్వయంగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో రికార్డు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని à°† నోటీసుల్లో హెచ్చరించారు.

కాగా ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్న మీసేవ కేంద్రాల కోఆర్డినేటర్లకు నోటీసులు జారీ చేయడంతో జిల్లావ్యాప్తంగా కలకలం రేగింది. రాష్ట్రంలో మీసేవ కేంద్రాల ఆవిర్బావం నుంచి పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తూ వచ్చారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈసేవ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజీవ్‌ ఇంటర్నేట్‌ కేంద్రాలుగా మార్పుచేశారు. à°† తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీసేవ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. à°† విధంగా మీసేవ కేంద్రాల ద్వారా 535 రకాల సేవలను ప్రజలకు అందించే విధంగా ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు.