ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లిన కారు

Published: Sunday February 23, 2020

వరాత్రి పర్వదినం వారిళ్లలో చీకట్లను నింపింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూ జకు వెళ్లేందుకు కారును శుభ్రపరచడానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. à°ˆ సంఘటన మండలంలోని సర్నేనిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా సర్నేనిగూడెం సర్పంచ్‌ రాణి ఉపవాసం ఉంది. పూజకు వెళ్లేందుకు కారును శుభ్రం చేయడానికి రాణి భర్త మధు, కుమారుడు మణికంఠ, డ్రైవర్‌ శ్రీధర్‌ సాయం త్రం 4గంటలకు గ్రామ సమీపంలోని వెల్లంకి  ఈదుల చెరువు దగ్గరలోని వ్యవసాయ బావి వద్దకెళ్లారు. కారును శుభ్రం చేసి తిరిగి సర్నేనిగూడెం గ్రామానికి పయనమయ్యారు. వెల్లంకి చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి చెరువులో పడింది. రాత్రి కావస్తున్నా కారును శుభ్రం చేయడానికి వెళ్లిన భర్త రాకపోవడంపై భార్య స్నేహితులు, బంధువులతో పలుచోట్ల వాకబు చేసింది. సెల్‌ఫోన్‌ సైతం పనిచేయక పోవడంతో  ఆందోళనకు గురైన సర్పంచ్‌ రాణి అర్ధరాత్రి దాటా à°• పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆచూకీ కోసం వెతికారు. 

 

సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కారు ఈదులచెరువు కట్ట పైనుంచి పెద్దకాపర్తి రూట్‌లో వెళ్తున్నట్లుగా సీసీ కెమెరాలో నమోదైనా గ్రామానికి రాలేదు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ చెరువు సమీపంలోనే నమోదయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు చె రువు వద్ద ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భావించారు. గ్రా మస్థుల సహకారంతో సుమారు గంటసేపు గాలించి కారు చెరువు లో ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హుటాహుటిన ప్రమాదం జరిగిన చెరువు వద్దకు చేరుకున్నారు. జేసీబీని తెప్పించి పోలీసులు, స్థానిక  యువకుల సాయంతో చెరువులో మునిగిన కారును వెలికితీశారు. అప్పటికే ముగ్గురు కారులో మృతిచెందిన ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదంలో భర్త, కుమారున్ని కోల్పోవడంతో సర్పంచ్‌ రాణి కన్నీరుమున్నీరుగా విలపించింది.