ప్రధాన దేవాలయాల్లో ఆయన మాటే వేదం

Published: Wednesday February 26, 2020

మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో నామినేటెడ్‌ పదవులు దక్కడం సహజమే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో à°“ ప్రముఖ స్వామీజీ పేరిట కొత్తగా మరో కోటా ఏర్పడింది. సీఎం జగన్‌ సహా ప్రభుత్వ పెద్దలు, కీలక ఉన్నతాధికారులు తరచూ ఆయన దగ్గరకు వచ్చి పోతుండటంతో ఆయన మాటకు ఎదురే లేకుండా పోయిందని చెబుతున్నారు. కీలక దేవాలయాలకు పాలక మండ ళ్లు నియమించే సమయంలో తప్పనిసరిగా ఆయన సూచించిన వారికి అవకాశం కల్పించాలని అనధికారిక ఆదేశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇది à°’à°• à°°à°•à°‚à°—à°¾ జీవోలానే భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. రెండురోజుల క్రితం విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలిలో గుంటూరుకు చెందిన హోమియో వైద్యుడు ఓవీ రమణకు చోటు లభించింది. సదరు స్వామీజీకి ఆయన అత్యంత అనుంగు శిష్యుడు. ఇటీవల స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన à°’à°• కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించేందుకు à°ˆ వైద్యుడే వెళ్లి ఆహ్వానపత్రం కూడా అందించారు. 

 

ఇటీవల గుంటూరులోని గోరంట్ల ప్రాంతంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన స్వామీజీ తిరిగి కారు దగ్గరకు వెళ్తుండగా రాజధాని ప్రాంత మహిళలు ముట్టడించి ‘జై అమరావతి’ అనాలని పట్టుబట్టారు. à°† సమయంలో పక్కనే ఉన్న రమణ ఆయనను ఆందోళనకారుల నుంచి తప్పించి కారులో తీసుకెళ్లిపోయారు. à°ˆ సంఘటనల ద్వారా స్వామీజీతో ఆయనకున్న సాన్నిహిత్యం వెల్లడైంది. ప్రస్తుతం ఆయన సిఫారసుతోనే రమణకు పాలకమండలిలో చోటుదక్కిందని చెబుతున్నారు. à°ˆ పదవికోసం గుంటూరు నగరానికి చెందిన పలువురు వైసీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ అవకాశం లభించలేదు. తమకు కాకుండా పార్టీతో ఏమాత్రమూ సంబంధం లేనివ్యక్తికి à°† పదవి దక్కడంతో అంతా విస్మయానికి గురయ్యారు. స్వామీజీ సిఫారసుతోనే వైద్యుడికి పదవి దక్కిందని తెలియడంతో భగ్గుమంటున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రముఖ ఆలయ పాలకమండళ్లలోనూ ఆయన సిఫారసుతో పదవులు పొందినవారున్నారని తెలుస్తోంది. గుంటూరుజిల్లా నుంచి దుర్గగుడి పాలకమండలిలో ఇద్దరికి చోటు దక్కగా అందులో రమణ ఒకరు. రెండోది వైసీపీ సానుభూతిపరుడి కుటుంబానికి దక్కింది.