ఇండియాకు శుభవార్త

Published: Wednesday June 10, 2020

కరోనా వైరస్ భయంతో తల్లడిల్లుతున్న దేశవాసులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇండియాలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల కంటే కోలుకుంటున్న వారి (రికవరీ) కేసుల సంఖ్య పెరిగిందని బుధవారంనాడు పేర్కొంది.

 

పూల్‌లో ఎన్ని కేసులు ఎంటర్ అయ్యాయి, ఎన్ని కేసులు పూల్ నుంచి బయటకు వెళ్లిపోయాయనేదాన్ని రెలేటివ్ రిమూవల్ రేటుగా చెబుతారు. కోవిడ్ వైరస్ బారిన పడిన వారి సంఖ్య, కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య సమమైనప్పుడు అది క్రమంగా 100 శాతం కేసుల నిష్క్రమణ దశకు చేరుతుందని ఇటీవల జరిపిన à°“ రీసెర్చ్‌‌లో తేలింది. à°ˆ ప్రకారం కరోనా కేసుల పూర్తి నిష్క్రమణ సెప్టెంబర్‌లో ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య..చురుకుగా ఉన్న కేసుల సంఖ్యను దాటిపోయింది. దీంతో పూర్తిగా కరోనా వైరస్ కేసుల నిష్క్రమణ ఖాయమనే సంకేతాలు ప్రస్ఫుటమవుతున్నాయని చెబుతున్నారు.

 

కాగా, బుధవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల్లో సుమారు 10,000 కొత్త కేసులు నమోదయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.7 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ మృతుల సంఖ్య 279కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 7,745గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,33,632 కాగా, స్వస్థత చేకూరిన వారి సంఖ్య 1,35,205కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది