కండ్లకలక కొవిడ్-19 లక్షణం కావచ్చు.

Published: Friday June 19, 2020

ఇప్పటి వరకు దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఇలాంటివే కొవిడ్-19 లక్షణాలుగా భావిస్తున్నారు. అయితే కండ్లకలక కూడా కోవిడ్-19 ప్రాథమిక లక్షణాల్లో ఒకటని పరిశోధకులు గుర్తించారు. కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురించిన à°“ అధ్యయనంలో à°ˆ మేరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మార్చిలో 29 ఏళ్ల à°“ మహిళ తీవ్రమైన కండ్లకలక సమస్యతో రాయల్ అలెక్సాండ్రా ఆస్పత్రికి చెందిన ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్బెర్టాకి వచ్చింది. కండ్లకలకతో పాటు ఆమెకు కొద్దిమేర ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంది. వైద్యులు కొద్ది రోజులపాటు చికిత్స అందించిన తర్వాత కూడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఆమె ఇటీవల ఆసియా నుంచి తిరిగి వచ్చినట్టు చెప్పడంతో... à°“ వైద్యుడు అనుమానం వచ్చి కొవిడ్-19 పరీక్షలు రాశారు. దీంతో ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

 

‘‘à°ˆ కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆమె అస్వస్థతకు à°—à°² ప్రధాన లక్షణాల్లో శ్వాసకోశ సమస్య అంతగా కనిపించలేదు. కళ్లకలకే ప్రధాన లక్షణంగా ఉన్నట్టు గుర్తించాం. కనీసం జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఏవీ లేకపోవడంతో కొవిడ్-19 అన్న సందేహం మాకు రాలేదు. ఊపిరితిత్తుల్లో ప్రాధమిక సమస్య లేకుండా కళ్ల సమస్య ద్వారా దీన్ని ఎలా గుర్తించాలో మాకు అర్థంకాలేదు...’’ అని కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్లోస్ సోలార్టే పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై ఇటీవల వెలువడిన పలు అధ్యయనాల్లో.. దాదాపు 10 నుంచి 15 శాతం మంది కొవిడ్-19 పేషెంట్లకు కండ్లకలక ద్వితీయ ప్రాథమిక లక్షణంగా ఉన్నట్టు తేలిందన్నారు.