రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు బోస్‌, మోపిదేవి, అయోధ్య, నత్వానీ ఎన్నిక

Published: Saturday June 20, 2020

 à°†à°‚ధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో అన్నిటినీ వైసీపీ సునాయాసంగా దక్కించుకుంది. à°† పార్టీ అభ్యర్ధులు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ‘రాంకీ’ అయోధ్యరామరెడ్డి , రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం చైర్మన్‌ పరిమళ్‌ నత్వానీ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభం కాగానే...  ముఖ్యమంత్రి జగన్‌ తొలి ఓటు వేశారు. తర్వాతి ఓటును సభాపతి తమ్మినేని సీతారాం వేశారు. నలుగురు అభ్యర్ధులకు ఎవరెవరు ఓటు వేయాలో వైసీపీ తన ఎమ్మెల్యేలకు ముందుగానే నిర్దేశించింది. సుభాష్‌ చంద్రబోస్‌ ఓటర్ల ప్యానల్‌లో సీఎం ఉన్నారు. శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను 173 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, హోం క్వారంటైన్‌లో ఉన్న రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఓటేయలేదు.

 

ఒక్కో వైసీపీ అభ్యర్థికి 38 చొప్పున ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. టీడీపీకి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తమ అభ్యర్థి పేరు ముందు టిక్‌ పెట్టడంతో సాంకేతికంగా అది చెల్లకుండా పోయింది. అదేవిధంగా టీడీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలు కరణం బలరాం, à°—à°¿à°°à°¿, వల్లభనేని వంశీ అడ్డంగా గీత పెట్టడంతో.. అవి కూడా సాంకేతికంగా చెల్లుబాటు కాలేదు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌  అధికార పక్షానికి ఓటేశారు. వైసీపీ అభ్యర్దులు నలుగురూ విజయం సాధించారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం.. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పరిమళ్‌ నత్వానీ ముఖ్యమంత్రిని కలసిధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు.