భద్రతా బలగాలకు ‘ఫ్రీ హ్యాండ్’

Published: Sunday June 21, 2020

 à°—ాల్వాన్ లోయలో భారత, చైనా ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో ఆర్మీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి దళాల మోహరింపుతో పాటు, సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వీరందరూ సమీక్షించినట్లు సమాచారం.

 

ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం తలెత్తేలా ప్రవర్తించకూడదని, ఒకవేళ చైనా మాత్రం అందుకు తగ్గ వాతావరణం కల్పిస్తే మాత్రం... ఏమాత్రం వెనక్కితగ్గకుండా దీటైన రిప్లై ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంలో మాత్రం భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, చైనాకు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ప్రభుత్వ వర్గాలు అన్యాపదేశంగా స్పష్టం చేశాయి.

 

రక్షణ మంత్రి మాస్కో పర్యటనకు బయల్దేరే ఒక్క రోజు ముందు కేంద్రం ఇంతటి కీలక నిర్ణయం తీసుకుంది.  త్రివిధ దళాలూ చైనా విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని, చైనా విషయంలో à°•à° à°¿à°¨ వైఖరి అవలంబించాని à°ˆ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సైన్యమే సొంత నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.