భారత భూమివైపు కన్నెత్తి చూసిన వాళ్లకు జవాన్లు తగిన గుణపాఠం

Published: Sunday June 28, 2020

 à°šà±ˆà°¨à°¾à°¤à±‹ ఉద్రికత్తల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడక్‌లో భారత భూమివైపు కన్నెత్తి చూసిన వాళ్లకు జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌కు స్నేహ హస్తం అందించడమే కాదు, ద్రోహం చేసేందుకు యత్నించే వారికి సరైన రీతిలో గుణపాఠం నేర్పడం కూడా వచ్చని ప్రధాని చెప్పారు. భారత మాత గౌరవానికి à°­à°‚à°—à°‚ కలగకుండా చూసేందుకు సైనికులు పరాక్రమం చూపారని చెప్పారు. లడక్‌లో భారత సైనికులు చూపిన పరాక్రమాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని ప్రధాని చెప్పారు. సైనికులకు జాతి యావత్తూ నివాళి అర్పిస్తోందన్నారు. సైనికుల మరణాలపై వారి కుటుంబ సభ్యులే కాకుండా ప్రతి భారతీయుడూ బాధ పడుతున్నారని చెప్పారు. భారత వీర పుత్రుల బలిదానాలపై దేశమంతా గర్వపడుతోందని, ఇదే భారత బలమని ప్రధాని చెప్పారు. ఆకాశవాణి మన్‌à°•à±€ బాత్‌ ద్వారా దేశ ప్రజలతో తన మనోభావాలు పంచుకుంటూ à°ˆ విషయం చెప్పారు. చైనాతో ఉద్రిక్తతల వేళ ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.