కరోనా వీసాలొస్తాయ్‌..

Published: Sunday June 28, 2020

దేశాలు, రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తిస్థాయి రాకపోకలు జరగడం లేదు. ఇలా ఎన్నాళ్లో ఊహించలేం. కాబట్టి ఇదివరకటిలా బృంద పర్యటనలు ఉండకపోవచ్చు. వీకెండ్‌ డ్రైవ్‌లపై ఆసక్తి చూపించవచ్చు. అత్యంత సన్నిహితులు అయితే తప్ప వెళ్లే పరిస్థితి ఉండదు. à°’à°‚à°Ÿà°°à°¿ పర్యటనలు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులపై వైరస్‌ ప్రభావం అధికం కాబట్టి.. వాళ్లు కొత్త ప్రాంతాలకు వెళ్లలేరు. అందులోనూ హోటళ్లు, ఎయిర్‌లైన్స్‌లలో కూడా వారిని నిరాకరించే పరిస్థితి ఉంది. à°ˆ నేపథ్యంలో యువత, నడివయస్కుల పర్యాటకులు పెరిగే వీలుంది. నేచర్‌, అడ్వెంచర్‌ క్యాంప్లింగ్‌, వైల్డ్‌ లైఫ్‌ డ్రైవ్‌లకు ఆదరణ లభించనుంది. సొంత టెంట్లు, వంట సరంజామా సిద్ధం చేసుకుని ప్రయాణాలకు యువత సిద్ధం కాబోతోంది. 

 

ఫ్యామిలీ టూరిజం అనేది పాతరోజుల్లోకి వెళ్లనుంది. ఇంటికి తాళం వేసి, ‘చుట్టాలింటికి వెళ్తున్నాం’ అని పక్కింటోళ్ళకి చెప్పి వెళ్లే ఒకానొకప్పటి రోజులు తిరిగి రానున్నాయి. ఎక్కడికో వెళ్లి హోటల్లో భయం భయంగా విడిది చేయడం కన్నా చుట్టాలింటికి వెళ్లి ప్రశాంతంగా గడపడం అనేది నమ్మకంతో కూడిన వ్యవహారం కానుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సొంత వాహనాల్లో బయల్దేరి తిరిగి వీలైనంత తక్కువ సమయంలో ఇంటికి చేరుకోడానికే ఇష్టపడతారు. లేదంటే నమ్మకమైన చోటే ఎక్కువ రోజులు విడిది చేయడానికి ఆసక్తి చూపుతారు. రోజుకో ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. రైలు, బస్సు, విమానాల్లో ప్రయాణించడానికి భయం పట్టుకున్న కారణంగా.. సొంత వాహనం లేని వారి సేవలో సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లకూ గిరాకీ పెరగనుంది.

 

అంతర్జాతీయ బోర్డర్లు తెరుచుకోవడం అన్నది ఇప్పుడప్పుడే ఆశించే పరిణామం కాదు. ఒకవేళ ఓపెన్‌ అయినా .. ప్రయాణం సురక్షితం అన్న నమ్మకం కుదిరే వరకు.. ఎవరూ దేశం దాటి బయటికి వెళ్లే వీలు లేదు. వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదికి పైనే పడుతుందనుకున్నా.. అప్పటి వరకు అంతర్జాతీయ ప్రయాణం ఆదరణకు నోచుకోవడం అన్నది అసంభవం. ఎవరైనా వెళ్లేందుకు సిద్ధపడ్డా కూడా ఇప్పటి వరకు డిమాండ్‌ ఉన్న అమెరికా, యూరప్‌ దేశాలకు వెళ్ళడానికి à°…à°‚à°¤ త్వరగా సాహసించే అవకాశం లేదు. చైనా వైపు అసలు చూడను కూడా చూడరు. శ్రీలంక, భూటాన్‌ వంటి దగ్గరగా ఉండే సురక్షితమైన దేశాలు పర్యటించడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.

విదేశీ ప్రయాణాలకు హెల్త్‌సర్టిఫికెట్లు తప్పనిసరి అవ్వొచ్చు. కరోనా లేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు వీసా కోసం వారు ఆమోదించిన పరీక్షా కేంద్రాల్లో ఆరోగ్య పరీక్ష చేసుకోవాల్సిందే. వారి దేశంలో ఉండగా కరోనా సోకితే అక్కడ చికిత్సకు, క్వారంటైన్‌కు అవసరమయ్యే ఖర్చులను లేదా భారీ మొత్తంతో చేయించుకున్న ఇన్స్యూరెన్స్‌ను కూడా ముందుగా చూపించాల్సి రావొచ్చు. ఒకవేళ కరోనా వల్ల చనిపోతే, మృతదేహాన్ని స్వదేశం తరలించడం ప్రయాస. కాబట్టి అక్కడే దహన సంస్కారాలకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. కొంత కాలానికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు సర్టిఫికేట్‌ లేదా డిక్లరేషన్‌ ఇవ్వక తప్పదు.

మాస్క్‌ లేకుండా ఎయిర్‌పోర్టులోకి, విమానంలోకి అనుమతించరు. ఇన్ర్ఫారెడ్‌ థర్మామీటర్లతో ఉష్ణోగ్రత చూస్తారు. ఇంతకుముందులా పొడుగైన చెకిన్‌ క్యూలు కనిపించవు. à°’à°• చెకిన్‌ బ్యాగుని మాత్రమే అనుమతిస్తారు. ఆన్లైన్‌ చెకిన్‌ ఉంటుంది. విమానంలో ఆహార సరఫరా ఉండదు. అత్యవసరమైతే తప్ప మంచినీరు కూడా ఇవ్వరు. సీటు వెనుక కవర్లో ఉండే పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, లీఫ్లెట్లు లేవిప్పుడు. వాటి స్థానంలో డిస్పోజబుల్‌ గ్లోవ్స్‌, శానిటేషన్‌ టిష్యులు ఉండే అవకాశం ఉంది. విమానంలో సోషల్‌ డిస్టెన్స్‌ ఏర్పాట్లు, ఇతర అదనపు సౌకర్యాల కల్పన నేపథ్యంలో దాదాపు 50 శాతం విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉంది.