ఉగ్రవాదుల కాల్పుల నడుమ బాలుడిని కాపాడగలిగాం

Published: Wednesday July 01, 2020

ఉగ్రవాదులు పొంచి ఉండి కాల్పులు జరుపుతున్న సమయంలో జమ్మూ-కశ్మీరు పోలీసులు చాకచక్యంగా à°“ మూడేళ్ళ బాలుడిని సురక్షితంగా కాపాడారు. తాము ఇటువంటి సమయాల్లో బాలలను కాపాడటానికే పెద్ద పీట వేస్తామని సోపోర్ ఎస్‌హెచ్ఓ అజీం ఖాన్ బుధవారం చెప్పారు. పోలీసులపైకి ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న సమయంలో బాలలను కాపాడటం అత్యంత సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు. 

 

బుధవారం ఉదయం 7.30 à°—à°‚à°Ÿà°² సమయంలో సీఆర్‌పీఎఫ్ 179 బెటాలియన్ గస్తీ కోసం సోపోర్‌లోని మోడల్ టౌన్‌కు వెళ్ళింది. à°† సమయంలో à°“ మసీదులో పై అంతస్థుల్లో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. à°ˆ కాల్పుల్లో à°“ సాధారణ వ్యక్తి, సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. 

 

ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో  à°† మార్గంలో à°“ సాధారణ వ్యక్తి వాహనం అటు వెళ్తోంది. కాల్పుల మోత విని à°† వ్యక్తి వాహనం నుంచి క్రిందికి దిగి, దాక్కునే ప్రయత్నం చేశారు. అయితే మసీదు నుంచి ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో à°† వ్యక్తి తీవ్రంగా గాయపడి, మరణించారు. అనంతరం à°† వ్యక్తి మృతదేహం వద్దకు మూడేళ్ళ బాలుడు వచ్చాడు. వీరిద్దరూ బంధువులేనని తెలిసింది. à°† బాలుడిని సురక్షితంగా కాపాడగలిగారు.

 

‘‘మేము సంఘటనా స్థలానికి చేరుకునేసరికి చాలా ఆందోళనకరంగా కనిపించింది. à°† బిడ్డను కాపాడటమే మా ప్రాధాన్యం. మా మీద ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండటం వల్ల à°† బిడ్డను కాపాడటం చాలా సవాలుతో కూడుకున్నది. à°† బాలుడు తన తాతతో కలిసి హంద్వారా వెళ్తున్నాడు’’ అని ఎస్‌హెచ్ఓ ఖాన్ చెప్పారు.