ఓవైపు సైనిక దళాలు..మరోవైపు ఉగ్రవాదులు..

Published: Wednesday July 01, 2020

సరిహద్దు వివాదం పరిష్కారం కోసం భారత్ చైనా శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. భారత్‌తో ద్విముఖ పోరు సల్పేందుకు à°—à°² అవకాశాలను వెతుక్కుంటోందని à°ˆ విషయంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

 

ఇప్పటికే పాకిస్థాన్ చైనాకు మద్దతుగా లద్దాఖ్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతంలో భారీగా సేనలను మోహరించినట్టు సమాచారం. గల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా పాక్ తన సేనలను తరలించింది. చైనా సేనలకు దీటుగా ఏకంగా 20 వేల మంది సైనికులను à°…క్కడ మోహరించిందట. మరోవైపు..జమ్ము కశ్మీర్‌లో హింసను రెచ్చగొట్టేందుకు అల్ బదర్ అనే ఉగ్రసంస్థతో చైనా ఆర్మీ సంప్రదింపులు జరుపుతోందని కూడా తెలిసింది.

 

అంతేకాకుండా.. జమ్మూకశ్మీర్‌లోకి మరింత మంది ఉగ్రవాదులను చొప్పించేందుకు పాకిస్థాన్ చైనా ప్రోత్సాహంతో ముమ్మర ప్రయాత్నాలు చేస్తోంది. పాక్ కమాండోలు, ఉగ్రవాదులతో కూడిన బ్యాట్ దళాలతో సరిహద్దు వెంబడి భారత భద్రతా దళాలపై దాడుల చేయాలనే యోచనలో కూడా ఉందట.

 

చైనాతో భారత్‌కు ఉన్న వివాదం అడ్డుపెట్టుకుని తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్న పాక్ కుయుక్తులను పసిగట్టిన భారత్ వర్గాలు à°ˆ విషయంలో తగు నివారణ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.à°ˆ విషయమై భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు.. భారత ఆర్మీ అధికారులతో ఇటీవల సమావేశమై అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం పోంచి ఉన్న ప్రమాదాన్ని ఎలా నిలువరించాలనే దానిపై వారు విస్తృత చర్చ జరిపినట్టు తెలిసింది.