రష్యా నుంచి భారత్‌కు 21 మిగ్-29, 12 ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు

Published: Thursday July 02, 2020

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల వేళ రష్యా నుంచి 21 మిగ్-29, 12 ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. వీటి ఖరీదుకు సంబంధించి భారత రక్షణ రంగానికి చెందిన డిఏసీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 59 మిగ్-29 యుద్ధ విమానాలను కూడా ఆధునికీకరిస్తారు. మిగ్-29 యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునికీకరణకు 7418 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు. ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాల కోసం 10730 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు.

 

ఆయుధాల కొనుగోలుకు సంబంధించి జులై రెండున రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో 38, 900 కోట్ల రూపాయల మొత్తం కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా 31,130 కోట్ల రూపాయలు దేశీయంగా తయారయ్యే ఆయుధాల కోసం కేటాయిస్తారు. త్రివిధ దళాలకు ఉపయోగపడే ఆయుధాలు, క్షిపణులు డీఆర్‌డీఓలో తయారౌతున్నాయి. హెచ్‌ఏఎల్‌లో యుద్ధ విమానాలు తయౌరౌతున్నాయి. భారత్‌లో తయారీకి రష్యా అంగీకరించింది. అన్ని విధాలా సహకరిస్తోంది. 

 

జూన్ 15à°¨ లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నప్పటి నుంచీ భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు యత్నాలు కొనసాగుతున్నా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారత్‌కన్నా ఆరు రెట్లు బలగాలను మోహరించింది. దీంతో ఎల్‌ఏసీ వెంబడి 3500 కిలోమీటర్ల వరకూ భారత్ నిఘా పెంచింది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికాల నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను, క్షిపణి రక్షక వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తోంది.