కరోనాకు మందు తయారుచేసేందుకు మరో ఫార్మా కంపెనీకి గ్రీన్ సిగ్నల్

Published: Thursday July 02, 2020

కరోనా సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే రెమ్డిసివిర్‌ను తయారుచేసేందుకు మరో ఫార్మా కంపెనీకి డ్రగ్ రెగ్యులరేటర్ అనుమతినిచ్చింది. దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన మైలాన్‌కు రెమ్డిసివిర్‌ను తయారుచేసి, అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతి దక్కింది.

 

ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కూడా రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా ‘కోవిఫర్’ అనే 100 మిల్లీగ్రాముల వయల్‌ను(ఇంజెక్షన్‌) తయారుచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ సిప్లా కూడా రెమ్డిసివిర్‌కు జనరిక్ వెర్షన్‌ను తయారుచేస్తోంది. సిప్రెమి పేరుతో à°ˆ మందును విడుదల చేయనున్నట్లు à°† సంస్థ స్పష్టం చేసింది.

 

ఇలా మూడు ఫార్మా సంస్థలు ఇప్పటికి రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అంతేకాదు, రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ తయారీకి, మార్కెట్‌లో విడుదల చేసేందుకు తమకూ అనుమతి ఇవ్వాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీడీఆర్, జూబ్లియంట్ ఫార్మా సంస్థలు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో)కు ప్రతిపాదనలు పంపాయి.