అధికారం సేవ కోసమే

Published: Saturday July 04, 2020

రాజకీయాలను సేవ చేసే మాధ్యమంగానే చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఎప్పుడూ మాధ్యమంగా ఉపయోగించుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీ నిర్వహించిన ‘సేవా హీ సంఘటన్’ అన్న కార్యక్రమంలో భాగంగా ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నిస్వార్థ సేవ అన్నదే ప్రతిజ్ఞ, విలువలుగా ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. లాక్‌డౌన్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు చేసిన సేవలను à°ˆ సందర్భంగా మోదీ శ్లాఘించారు.

 

బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ‘సేవా యోజన’ మానవ చరిత్రలోనే పెద్ద కార్యక్రమం అని హర్షం వ్యక్తం చేశారు. దీనిపై డిజిటల్ బుక్ లెట్స్‌లను రూపొందించి మండల, జిల్లా స్థాయిలో పంచాలని ఆయన కార్యకర్తలను ఆదేశించారు. à°ˆ బుక్ లెట్స్ కనీసం 3 భాషల్లో ఉండేలా రూపొందించాలని సూచించారు. కరోనా అన్న మహమ్మారి ఉన్నప్పటికీ... ఏమాత్రం దానిని పట్టించుకోకుండా, జంకకుండా కార్యకర్తలు ప్రజలకు సేవ చేసి, వారి జీవితాలను తృణ ప్రాయంగా అర్పితం చేశారన్నారు. సేవలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు మోదీ నివాళులర్పించారు.

 

అత్యధిక  ఉష్ణోగ్రతల కారణంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో కోవిడ్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని కొందరు పేర్కొన్నారని, అది పూర్తిగా తప్పని నిరూపించామని స్పష్టం చేశారు. రాజకీయాలను బీజేపీ ఎప్పటికీ సేవ అన్న దృష్టితోనే చూస్తుందని, ఎన్నికల గెలిచే యంత్రంగా చూడదని స్పష్టం చేశారు. ‘‘రాజకీయ వ్యాఖ్యాతలు ఎన్నికలను కేవలం రాజకీయ దృష్టికోణంలోనే చూస్తారు. కానీ బీజేపీ మాత్రం రాజకీయాలను సేవ అన్న దృక్పథం నుంచే చూస్తుంది. దీని ద్వారా ప్రజల్లో, సమూహాల్లో, దేశంలో à°“ పెద్ద మార్పును తీసుకురావచ్చు.’’ అని మోదీ స్పష్టం చేశారు.