చైనా మంత్రి వాంగ్‌ యితో అజిత్ దోవల్ వీడియో కాల్

Published: Monday July 06, 2020

న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీడియో కాల్ ద్వారా చర్చలు జరిపారు. చర్చలు సౌహార్ధపూర్వకంగా జరిగాయని అధికారవర్గాలు తెలిపాయి. 

 

అటు జూన్ 30à°¨ కమాండర్ స్థాయి మూడో దఫా చర్చల్లో నిర్ణయించిన విధంగా వాస్తవాథీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ కొనసాగుతోందని చైనా స్పష్టం చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్‌ను ఉటంకిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. 

 

జూన్ 15à°¨ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సందర్భంగా చైనా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకోవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అటు ఎల్‌ఏసీ వద్ద సైన్యాన్ని భారీగా మోహరిస్తూనే ఇటు చైనాను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. 59 చైనా యాప్‌లను నిషేధించింది. చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటూ పోయింది. ఆర్ధికంగా దెబ్బతినడం ప్రారంభమయ్యాక చైనాకు భారత్ విలువ తెలిసిసొచ్చింది. చివరకు గల్వాన్, గోగ్రా తదితర ప్రాంతాలనుంచి తన బలగాలను వెనక్కు పిలిపించుకుంటోంది.