హైదరాబాద్ నగరంపై ఆంధ్రా పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నారా

Published: Tuesday July 07, 2020

 à°Ÿà±€à°ªà±€à°¸à±€à°¸à±€ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డిపై ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిని ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ నగరంపై ఆంధ్రా పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రస్తావన తేవడాన్ని ఆయన పూర్తిగా తప్పు పట్టారు. నగరంలోని అన్ని భవనాలను తెలంగాణకు అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రస్తావన చేయడమేంటని నిలదీశారు. à°ˆ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 

‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెత్తనం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆంధ్రప్రదేశ్  సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతున్నట్లు కనబడుతున్నది’’ అని హరీష్ రావు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.