ఆఫీసులు వద్దంటున్న టెక్‌ దిగ్గజాలు

Published: Wednesday July 08, 2020

హైటెక్‌ సిటీలో ఆఫీస్‌ స్పేస్‌ అంటే హాట్‌ కేక్‌.. చిన్నపాటి స్థలం అయినా నిర్మాణంలో ఉండగానే బుకింగ్‌ అయిపోయేది. ఐటీ కారిడార్‌ పరిధిలోని మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువైన ప్రాంతం కాబట్టి దేశంలో ఏ నగరానికి లేనంత డిమాండ్‌ హైదరాబాద్‌లోని à°ˆ ప్రాంతాల్లో ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. కొత్త కార్యాలయాలకు రిజర్వ్‌ చేసుకున్న కంపెనీలు లీజు ఒప్పందాలు రద్దు చేసుకుంటుండగా.. à°‰ ద్యోగులు ఇంటినుంచి పని (వర్క్‌ ఫ్రం హోం) చేస్తుండగా.. ఇక విశాలమైన కార్యాలయాలు ఎందుకు  అంటూ మిగతావారు ఖాళీ చేస్తున్నారు. 

 

ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌తో పాటు అనేక టెక్‌ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నా యి.  దాదాపు 1,550 ఐటీ కంపెనీల్లో 6.5 లక్షల మంది పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 90ు వాటా పెద్ద కంపెనీలదే. హైటెక్‌ సిటీ ప్రారంభం నుంచి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా à°ˆ రంగాన్ని ప్రోత్సహించడంతో ఏటేటా గణనీయ వృద్ధి సాధిస్తోం ది. ఇప్పటికే ఉన్న కంపెనీలు కార్యాలయాలను విస్తరిస్తుండటం, కొత్త కంపెనీలు సైతం విశేష ఆసక్తి చూపిస్తుండటంతో ఆఫీస్‌ స్పేస్‌à°•à°¿ భారీ డిమాండ్‌ ఉండేది. 2019లో దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్పేస్‌ తీసుకున్న ప్రము à°– నగరాల్లో 12.8 మిలియన్‌ చదరపు అడుగులతో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. à°ˆ ఏడాది మరింత వృద్ధి అంచనా వేయగా.. కరోనా దెబ్బకొట్టింది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో 90ు పైగా మూడున్నర నెలలుగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.   

 

గూగుల్‌, డెలాయిట్‌ వంటి పలు ప్రముఖ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని డిసెంబరు వరకు కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టంచేశాయి. నిరుపయోగంగా ఉండటంతో లీజుకు తీసుకున్న కార్యాలయాల స్థలాన్ని తగ్గించుకోవాలని, లేదా పూర్తిగా ఖాళీ చేసి చిన్నపాటి స్థలాలకు వెళ్లాలన్న ఆలోచన కంపెనీ వర్గా ల్లో ఉంది. ఐటీ కంపెనీలు మొత్తం నిర్వహణ ఖర్చులో దాదాపు 30ు కార్యాలయ స్థలం లీజు, భవన నిర్వహణకే పోతుంది. ఇప్పుడీ ఖర్చు తగ్గనుంది.