ఆప్షన్‌ ఇచ్చినా.. లేదంటున్న సచివాలయాలు

Published: Wednesday July 08, 2020

కొత్త రైస్‌ కార్డుల ఆంక్షలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బియ్యం కార్డును ఆదాయానికి ప్రామాణికంగా తీసివేయటంతో నిత్యావసరాలను అందించే కార్డుగానే ఉపయోగపడుతోంది. పాత రేషన్‌ కార్డుల్లో ఉమ్మడిగా ఉండి, తర్వాత వేరు పడిన అర్హులు తమ పేరు వేరు చేయించుకోవాలంటే తల ప్రాణం తోకకు వస్తోంది. దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డు పది రోజుల్లోనే ఇంటికి వస్తుందని ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం à°ˆ చిన్న విషయాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావటం లేదు. 

 

కొత్త బియ్యం కార్డుల కోసం పాత కార్డుల నుంచి తమ పేరు వేరు చేయించుకోవాలనుకునే అర్హులకు నెలలు గడుస్తున్నా సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. ఇందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అవగాహన లేని సిబ్బంది ఇలాంటివి చేయటం లేదని చెబుతుండటంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి కుటుంబాల్లో ఉండి, à°† కుటుంబ కార్డులో పేరు నమోదై ఉన్న వారు, ఇప్పుడు తమ పేరు వేరు చేయించుకోవాలంటే సమస్య ఏర్పడుతోంది. 

 

à°’à°• కుటుబంలో పాత కార్డులో తల్లిదండ్రులతో పాటు కుమార్తె కూడా ఉంది. తర్వాత కుమార్తెకు పెళ్లి అయినా, పాత కార్డులోనే పేరు కొనసాగుతోంది. ఆమె ఉద్యోగం చేస్తూ ఆదాయపుపన్ను చెల్లించాల్సి వస్తే.. కార్డులో ఆమె పేరు ఉన్నందున తల్లిదండ్రులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. కొత్త రైస్‌ కార్డుకు తల్లిదండ్రులు కూడా అనర్హతకు గురి అవుతున్నారు.