ముందుంది ప్రమాదం.. మేల్కోవాలి తక్షణం

Published: Friday July 10, 2020

కరోనా వంటి విపత్కర సమయంలో మరో ప్రమాదం అటు ప్రజలను, ఇటు అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తోంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు మొదలయ్యాయి. దీంతో జ్వరాల సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఏటా జూలై నెలాఖరు నుంచి నవంబరు వరకు జిల్లాలో జ్వరాల తీవ్రత విపరీతంగా ఉంటుందని à°—à°¤ అనుభవాలు చెబుతున్నాయి. చాలా వరకు వైరల్‌ జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతుంటాయి. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడం ఎక్కువ మందిలో జరుగుతుంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో à°ˆ జ్వరాలమాటున పెను ప్రమాదం హెచ్చరిస్తోంది. à°“ వ్యక్తికి జ్వరం వస్తే అది సాధారణ జ్వరమా లేక కరోనా కారణంగా వచ్చిన జ్వరమా అని తెలుసుకోవడం చాలా కష్టం. కరోనా నిర్ధారణ పరీక్ష జరిపితే తప్ప తెలుసుకోవడం సాధ్యం కాదు. 

 

ఇప్పుడే ఎవరైనా జ్వరమంటూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుంటే ముందు కరోనా పరీక్ష చేయించుకొని రమ్మంటున్నారు. à°ˆ పరీక్ష ఫలితం వచ్చే వరకు రోగికి చికిత్స అందించకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. కానీ జిల్లాలో కరోనా పరీక్షలు à°…à°‚à°¤ వేగంగా జరగడం లేదు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో శాంపిల్స్‌ సేకరణ కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగ్గట్టుగా నిర్ధారణ చేసే సామర్థ్యం లేకపోవడంతో రోజుల తరబడి ల్యాబ్‌లలో శాంపిల్స్‌ పేరుకుపోతున్నాయి. ఇటువంటి తరుణంలో జ్వరాలు విజృంభిస్తే వారందరికీ పరీక్షలు నిర్వహించడం à°…à°‚à°¤ సులువైన పని కాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. à°“ వైపు వైద్య శాఖ ఇంటింటికీ తిరుగుతూ ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అన్న వివరాలు తెలుసుకుంటోంది. స్థానికంగా ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే జ్వరాల తీవ్రత పెరిగితే à°ˆ క్లినిక్‌à°² ద్వారా చికిత్స అందించడం కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు.