ఏపీలో భయపెడుతున్న కరోనా మృతుల సంఖ్య

Published: Saturday July 11, 2020

 à°•à°°à±‹à°¨à°¾ బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం కేసులతో పాటు మరణాలు కూడా పెరిగాయి. à°ˆ రోజు ఒక్కరోజే కరోనాతో 17 మంది చనిపోయారంటే... కోవిడ్ ఉధృతి రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో ఏపీలో 1813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1775, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా సోకింది. వివిధ దేశాల నుంచి వచ్చిన నలుగురు పాజిటివ్‌à°—à°¾ తేలారు. à°ˆ రోజు వచ్చిన కేసులతో కలిపి మొత్తం 27,235 మందికి రాష్ట్రంలో కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న14,393 మంది డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 12,533 యాక్టివ్ కేసుులన్నాయి.

 

ఏపీలో ఎన్నడూలేని విధంగా కరోనా 17 మందిని పొట్టనపెట్టుకుంది. ఇప్పటివరకు ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. ఈ రోజు మరణాల వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, విజయనగరం జిల్లాలో 3, కృష్ణాజిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు మృతి చెందారు. శుక్రవారం కూడా 15మంది మృతిచెందారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెగుతుండడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది.

 

 

నేతలను వెంటాడుతున్న కరోనా భయం

నేతలు, ప్రజాప్రతినిధుల్లో కరోనా లక్షణాలు  బయటపడితే కొందరు తమ పేరిట, మరి కొందరు గన్‌మెన్‌, పీఏ, పీఎస్‌, ఇంకా నమ్మకస్తుడి పేరిట పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగెటివ్‌ వస్తే తనకు కరోనాలేదని గొప్పగా ప్రకటిస్తున్నారు. పాజిటివ్‌ వస్తే మాత్రం దాన్ని మూడోకంటికి తెలియకుండా క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నారు. నెగెటివ్‌ వచ్చిందని చెప్పకపోయినా నష్టం లేదు. కానీ పాజిటివ్‌ వస్తేనే అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే, అప్పటి దాకా à°† ప్రజాప్రతినిధి వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు, పనులకోసం వచ్చిన సామన్య ప్రజలు కూడా అప్రమత్తమై పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు నేతలు  పరీక్ష ఫలితాలను గుట్టుగా ఉంచడంతో వారి కుటుంబంతోపాటు అనుచరులు, ప్రజలు మరింత ప్రమాదంలో పడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు.