కృష్ణాకు పట్టిసీమ నీళ్లు నిలిపివేత

Published: Sunday July 12, 2020

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వెలగలేరు వాగు నుంచి 16వేల క్యూసెక్కుల నీరు కృష్ణానదిలోకి వస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు శనివారం సాయంత్రం ఐదు గేట్లను అడుగు మేర ఎత్తారు. 3,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులు ఉంది. కాగా, వెలగలేరు నుంచి వరద వస్తుండడంతో పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా కృష్ణాడెల్టాకు విడుదల చేసే ప్రక్రియను శనివారం ఉదయం నిలిపివేశారు. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీటి నిల్వలు భారీగా ఉండడం, కృష్ణాడెల్టాలోనూ పుష్కలంగా నీళ్లు ఉండడంతో పట్టిసీమ నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈ ఖండవల్లి వరప్రసాద్‌ తెలిపారు. జూన్‌ 18à°¨ నీటి విడుదల ప్రారంభించినప్పటి నుంచి శనివారం వరకూ 10.10 టీఎంసీల నీరు కృష్ణాడెల్టాకు విడుదల చేశామని చెప్పారు.