ఐపీఎస్‌లకు అధునాతన ఆయుధాలు

Published: Sunday July 12, 2020

‘పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమార్కులు స్మగ్లింగ్‌ చేసి మద్యం తీసుకొస్తున్నారు.. దీని కట్టడిలో మీ సహకారం కావాలి’ అని దక్షిణాది రాష్ట్రాల డీజీపీలను గౌతమ్‌ సవాంగ్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ పోలీసు ఉన్నతాధికారుల మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. à°ˆ సందర్భంగా సవాంగ్‌ మాట్లాడుతూ అక్రమంగా మద్యం దిగుమతి, ఇసుక ఎగుమతి తెలంగాణ, కర్ణాటక నుంచి ఎక్కువగా ఉందన్నారు. మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాల ఆట కట్టించేందుకు సహకారం కోరారు.

  

ఉండవల్లిలోని ఫైరింగ్‌ రేంజ్‌ను శనివారం డీజీపీ సందర్శించి, ఇజ్రాయెల్‌కు చెందిన మసాదా, ఎక్స్‌95, పీఎల్‌ఆర్‌ వంటి అత్యాధునిక ఆయుధాల పనితీరును పరిశీలించారు. స్వయంగా ఫైరింగ్‌ ప్రాక్టీసు చేసి అధికారులను ఉత్సాహపరిచారు. ఐపీఎస్‌ అధికారులకు అధునాతన గ్లాక్‌ పిస్టల్స్‌ను డీజీపీ అందజేశారు. ఫైరింగ్‌ మెలకువలపై అధికారులకు సూచనలిచ్చారు.