భారత్‌లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు

Published: Monday July 13, 2020

రానున్న 5-7 సంవత్సరాల్లో ఇండియాలో దాదాపు రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. à°ˆ మేరకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నేడు à°“ ప్రకటన చేశారు. గూగుల్ ఫర్ ఇండియాలో భాగంగా డిజిటైజేషన్‌ ఫండ్ రూపంలో à°ˆ పెట్టుబడులు ఉండనున్నట్లు తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని పిచాయ్ వెల్లడించారు. ఈక్విటీ వాటాలలు, సంస్థల్లో భాగస్వామ్యం, పర్యావరణ హిత మౌలిక సదుపాయాల కల్పన తదితర కార్యకలాపాల్లో à°ˆ పెట్టుబడులు ఉండనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా వైద్య విద్య, వ్యవసాయ రంగాల్లో ఏఐ, వ్యాపార అభివృద్ధి, భారత్‌లో ఎన్నడూ లేని సరికొత్త ప్రాడక్ట్‌à°² ఉత్పత్తి, భారతీయ భాషలపై ముఖ్యంగా దృష్టి సారించినట్లు చెప్పారు. భవిష్యత్ టెక్నాలజీను భారత్‌ ముందుండి నడిపించాలనేదే తన కోరిక అని పిచాయ్ అన్నారు. 

 

ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ మీటింగ్ అనంతరం పిచాయ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు. అనేక విషయాలపై కూలంకషంగా చర్చించామని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా భారతీయ రైతులు, యువతరం, వ్యాపారవేత్తల భవిష్యత్తును మార్చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై చర్చించామని ప్రధాని వెల్లడించారు.