నేపాల్ ప్రధానిపై ఒంటి కాలుతో లేచిన శివసేన

Published: Wednesday July 15, 2020

శ్రీరాముడు భారత్‌లో పుట్టలేదని, నేపాల్‌లో పుట్టాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని ఓలీపై శివసేన తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదమని సామ్నాలో పేర్కింది. ఓలీ చైనాకు కీలుబొమ్మ à°—à°¾ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తింది.

 

‘‘నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనా కీలుబొమ్మ. చైనా ప్రతిరోజూ సూచనలివ్వడంతోనే భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొదట్లో మ్యాప్ విషయంలో వివాదాస్పదం చేశారు. ఇప్పుడు రాముడిపై వివాదం చేస్తున్నారు. భారత్‌లో ఉన్న అయోధ్య నిజం కాదని, నిజమైన అయోధ్య భారత్‌లో ఉందన్న ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం’’ అని శివసేన మండిపడింది.

 

పురాణాల ప్రకారం అయోధ్య సరయూ నది ఒడ్డున ఉందని, కానీ నేపాల్ లో ఆ పేరుతో నది లేదంటూ పేర్కొంది. కర సేవ సమయంలో చాలా మంది కర సేవకులు తమ నెత్తురును చిందించారని, ఆ సమయంలో ఓలీ ఎక్కడున్నారంటూ మండిపడింది. ఇప్పుడు రాముడు తమవాడంటూ ఓలీ మాట్లాడుతున్నారని, మరి కొన్ని రోజుల్లో బాబర్ కూడా తమవాడంటూ వస్తారంటూ ఎద్దేవా చేశారు.

 

‘‘అయోధ్య నేపాల్‌లో ఉంది. ఓలి పూర్వీకులు బాబర్‌ను మోసగించారు. అతన్ని భారత్ వైపు మళ్లించారు. ఓలి బాబర్‌ను మోసం చేశారు. ఇది à°“ విధంగా ఇస్లాంను అవమానించడమే. మరి పాకిస్తాన్ ఓలీని శిక్షిస్తుందా’’ అని సూటిగా ప్రశ్నించింది. భారత్, నేపాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని మరిచిపోయి ఓలీ మాట్లాడుతున్నారని, చైనా బెదిరింపులతోనే ఇలా మాట్లాడుతున్నారని శివసేన ఆరోపించింది. అందుకే ఓలీ పదవిని కాపాడడానికి చైనా రాయబారి ప్రయత్నిస్తున్నారని శివసేన తీవ్రంగా మండిపడింది.