స్మారక చిహ్నంగా జయలలిత నివాసం

Published: Thursday July 16, 2020

తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చాలని యోచిస్తోంది. à°ˆ మేరకు మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. జయలలిత ఇంటిలోని అత్యధిక భాగాన్ని స్మారక చిహ్నంగా కాకుండా సీఎం అధికారిక నివాసంగా మార్చాలని యోచిస్తున్నట్టు కోర్టుకు తెలిపింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోయెస్ గార్డెన్ కస్తూరి ఎస్టేట్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. à°ˆ పిటిషన్ విచారణ  సందర్భంగా ప్రభుత్వం à°ˆ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది.

 

జయలలిత నివాసాన్ని కనుక స్మారక చిహ్నంగా మారిస్తే à°ˆ ప్రాంతం రద్దీగా మారుతుందని, ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ప్రశాంతత దెబ్బతింటుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. జస్టిస్ ఆనంద్ వెంకటేశ్‌కు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ చేసిన సబ్‌మిషన్‌లో.. ‘‘ ఇది మిలియన్ల మంది తమిళులకు పర్యాటక ప్రదేశంగా మారుతుంది. అమెరికా సందర్శించినప్పుడు ప్రజలు వైట్‌హౌస్‌ను, లింకన్ ఇంటిని సందర్శిస్తారు. అలాగే, యూకేలో షేక్‌‌స్పియర్ ఇంటిని సందర్శిస్తారు. ఇది కూడా అలాగే మారుతుంది’’ అని పేర్కొన్నారు. 

 

అడ్వకేట్ జనరల్ సబ్‌మిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి.. పలువురు నాయకుల ఇళ్లను స్మారక చిహ్నంగా మార్చారని, ఇది అసాధారణమేమీ కాదని అభిప్రాయపడ్డారు. అయితే, ట్రాఫిక్ అసెస్‌మెంట్ రిపోర్టుతో పాటు ఇతర నివాసితులతో సరైన సర్వే నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు.

 

జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చడంపై ప్రజలకు కూడా ఆసక్తి  లేదని పిటిషనర్ తెలిపారు. ఇరు వర్గాలు చేసిన సబ్‌మిషన్‌ను రికార్డు చేస్తూ జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ à°ˆ అభ్యర్థనను కొట్టిపడేశారు.  స్థానికులు ఇతర నివాసితుల శాంతియుత జీవనం ప్రభావితమయ్యేలా జనం గుంపులుగా గుమికూడతారన్న అసోసియేషన్ వాదనను అంగీకరించలేమని స్పష్టం చేశారు.