భారత్, చైనాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నాయి

Published: Saturday July 18, 2020

దౌత్యవ్యవహారాలలో పారదర్శకత ఉండదు. చైనా దౌత్యనీతిలో అటువంటి గుణాన్ని ఆశించడమంటే వెర్రి బాగుల తనమే అవుతుంది. గల్వాన్ మనకొక సరికొత్త చేదు అనుభవం. దాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న చిక్కులన్నీ ఇప్పుడు విడిపోతున్నాయి. 2019 అక్టోబర్ 12à°¨ మహాబలిపురం శిఖరాగ్ర సదస్సు గురించి à°—à°¤ శనివారం ఇదే కాలమ్ (కూలిపోతున్న ‘శిఖరాగ్రాలు’)లో నేనిలా వ్యాఖ్యానించాను: ‘వేగంగా క్షీణించిపోతున్న ఆర్థిక వ్యవస్థతో భారత్ పరిస్థితి బాగా బలహీనపడిందనే అంచనాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చినట్టు కన్పిస్తున్నది. చైనా అధ్యక్షుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నరేంద్రమోదీ పూర్తిగా విఫలమయ్యారు’. అయినప్పటికీ 2020 సంవత్సరాన్ని ‘భారత్-చైనా సాంస్కృతిక, ప్రజల స్థాయిలో సుహృద్భావ సంబంధాల’ సంవత్సరంగా పాటించాలనే ప్రతిపాదనను ఉభయదేశాలు ఆమోదించాయి. à°† తరువాత 2019 డిసెంబర్ 21à°¨ ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో కూడా à°† ఉల్లాసకర వాతావరణం కొనసాగింది. 

 

అయితే హిమాలయాలకు ఆవల వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. 2020 జనవరిలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ à°’à°• కొత్త ‘ట్రైనింగ్ మోబిలైజేషన్ ఆర్డర్’ (టిఎమ్ఓ) పై సంతకం చేసినట్టు కొద్ది రోజుల క్రితమే మన జాతీయ దినపత్రిక à°’à°•à°Ÿà°¿ వెల్లడించింది. à°† ఉత్తర్వు మేరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి ఎల్ ఏ) భారత్-చైనా వాస్తవాధీనరేఖ (ఎల్ ఏసీ) à°•à°¿ తమ వైపున సైనిక దళాల సమీకరణకు పూనుకున్నది. సరిహద్దు సమీపంలో దళాలను చురుగ్గా మొహరించడాన్ని ప్రారంభించింది. చైనా సైనిక దళాల కదలికలపై గూఢచార నివేదికలు 2020 ఏప్రిల్ మధ్యనాళ్ళ నుంచి లభ్యమవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పినట్టు మరో ప్రముఖ దినపత్రిక వెల్లడించింది.

 

à°ˆ విషయాలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి: చైనా అధ్యక్షుడు జారీ చేసిన కొత్త టిఎమ్ఓ గురించి సౌత్ బ్లాక్కు (మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెలవు), సైనిక దళాల ప్రధాన కార్యాలయానికి తెలియదా?; ఎల్ ఏ సీకి చైనా వైపున సైనిక దళాల సమీకరణను మన సైనిక గూఢచార వర్గాలు, రీసెర్చ్ అండ్ ఎనాల్సిస్ వింగ్ (à°°à°¾) కనిపెట్ట లేదా?; గల్వాన్‌లోయ, ప్యాంగాంగ్ సరస్సు మధ్య 200 à°•à°¿.మీ. పరిధిలో పలు ప్రదేశాల వద్ద ఎల్ఏసీ దిశగా వస్తున్న చైనీస్ వాహనాల, సైనికుల కదలికలను మన ఉపగ్రహాలు గుర్తించలేదా?; 2020 ఏప్రిల్ మధ్యనాళ్ళలో అందిన సైనిక గూఢచార వర్గాల నివేదికలను విశ్లేషించి, సమాచారాన్ని సంబంధిత ఉన్నత స్థాయి బాధ్యులతో పంచుకుని నిర్దిష్ట నిర్ణయాలకు రాలేదా? ప్రభుత్వం à°ˆ ప్రశ్నలకు ఇప్పుడు కాకపోయినా సరైన సమయంలో సమాధానాలు ఇచ్చి తీరాలి.