3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై పవన్ రియాక్షన్

Published: Tuesday July 21, 2020

మూడు రాజధానుల బిల్లుల వ్యవహారం ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆమోదిస్తారా.. లేకుంటే తిరస్కరిస్తారా..? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో, రాజకీయ నేతల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళవారం నాడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో పవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా కరోనా కష్టాలు, ఇళ్లు కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం వంటి అంశాలపై నాయకులతో ప్రధానంగా చర్చించారు. గృహ నిర్మాణంపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీతో కలసి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. 

‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళనకర రీతిలో ఉంది. à°ˆ ఉపద్రవం విజృంభిస్తోంది. అందుకు తగ్గ స్థాయిలో ప్రభుత్వ చర్యలు లేవు అనేది అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మాట. టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే టెస్ట్ రిజల్ట్ వెల్లడిలో జాప్యం గురించి ప్రజల్లో ఆందోళన ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం పరిగణించాలి. అలాగే ఆస్పతుల్లో అందుతున్న మౌలిక వసతుల కల్పనలో లోపాలు ఉన్నాయి. ఆక్సిజన్ కొరత ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై దృష్టిపెట్టకుండా ఇది సాధారణ జ్వరం అంటే ఎలా?’ à°…ని పవన్ ప్రశ్నించారు.

 

‘రాజధాని నిర్మిస్తాం అన్నారు కాబట్టే భూములు త్యాగం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను అందరూ స్వాగతిస్తారు. రాజధాని వికేంద్రీకరణతోనే అది సాధ్యం అని ప్రభుత్వం మొండిగా వెళ్తోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు గవర్నర్ ముందు ఉన్నాయి. అన్ని కోణాల్లో ఆలోచన చేయాలి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. రాజధాని నిర్మిస్తాం అంటేనే 29వేల మంది రైతులు 34వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. వారి త్యాగాలను గుర్తించాలి. రాజధాని రైతులకు బాసటగా నిలుస్తాం. రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ పేదలను ఇబ్బందిపెడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటేవారు తమ వర్గీయులకే కార్డులు ఇస్తూ, తమకు అనుకూలంగా లేరని అర్హులయిన వారి కార్డులను తొలగిస్తూ వస్తున్నారు. నేను క్షేత్ర స్థాయి పర్యటనలు చేసినప్పుడూ à°ˆ సమస్య తెలిపారు. ఇప్పుడు à°ˆ ప్రభుత్వం అదే పని చేస్తోంది. అలాగే రేషన్ డీలర్లకు à°—à°¤ కొన్ని విడతలుగా కమీషన్ చెల్లించకపోవడంతో వాళ్ళు ఆందోళనకు దిగి రేషన్ నిలిపివేశారు. ప్రభుత్వం చర్యల వల్ల డీలర్లు ఆందోళన చేస్తే అంతిమంగా నష్టపోయేది పేద ప్రజలే. డీలర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి’ à°…ని à°ˆ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు.