అమరావతే రాజధానిగా కొనసాగాలి..

Published: Tuesday July 21, 2020

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను రఘురామ కలిసి రెండు లేఖలు అందజేశారు. à°’à°•à°Ÿà°¿ వ్యక్తిగత భద్రత కోసం, రెండోది రాజధాని అమరావతి కోసం.. విడివిడిగా రెండు లేఖలు అందజేశారు. అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడారు. రాష్ట్రపతి తనకిచ్చిన సమయంలో ఎక్కువ సమయాన్ని రాజధాని అమరావతి గురించే మాట్లాడినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో బిల్లు పాస్ కాకపోతే.. à°† బిల్లు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండలి సెక్రటరీ మాత్రం దాన్ని పక్కన పెట్టారన్నారు. శాసనమండలి ఛైర్మన్ నిర్ణయాన్నే సెక్రటరీ ఒప్పుకోకపోవడం à°† వ్యవస్థకే మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు శాసనమండలి అయింది.. రేపు శాసనసభలో కూడా అలానే జరగొచ్చు. అయినా ప్రభుత్వం ఇటువంటి వాటికి సహకరించకూడదని హితవు పలికారు. అంతటితో ఆగారంటే.. బిల్లులు పాస్ కాలేదని ఏకంగా ఆవేశంలో శాసనమండలినే రద్దు చేసేశారన్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. అమరావతిని పలిపాలనా రాజధానిగా ఉంచాల్సిందే. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. à°ˆ విధంగానే రాష్ట్రపతికి విన్నవించా. నెల రోజుల తర్వాత రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ కూడా అటార్నీ జనరల్‌తో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అమరావతే రాజధానిగా ఉంటుందని తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యే రోజా అన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ‘మడమ తిప్పను.. మాట తప్పను’ అని చెప్పి ఇప్పుడెందుకు మాట తప్పారంటూ నిలదీశారు. ఎవరైనా దొంగ కేసులు పెడితే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాలి. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19ని ఉపయోగించుకోవాలి. అమరావతే మన రాజధాని.. అమరావతే కంటిన్యూ అయ్యేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. à°† కులం వారికంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వాళ్లే ఎక్కువ భూములిచ్చారు. కనుక వాళ్ల కోసమైనా అమరావతిని కొనసాగించాలి. ప్రస్తుతం అమరావతి రైతులకు అన్యాయం జరిగింది. రాత్రికి రాత్రి రాజధాని విశాఖ వెళ్లిపోయినా ఫర్వాలేదు. కానీ పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దాం. రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే.. బ్రతులు తెల్లారిపోతాయి. కాబట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. ఎందుకంటే à°—à°¤ ప్రభుత్వం అమరావతి కోసం చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసిందన్నారు. అయినా ఇప్పుడు విశాఖలో రాజధాని కట్టడానికి à°…à°‚à°¤ డబ్బు ఎక్కడిది.. దీన్ని కూడా ప్రజలు నిలదీయాలి’’ అని అన్నారు.