ఒకవేళ చైనా నుంచి మొదటగా వ్యాక్సిన్ వస్తే.

Published: Wednesday July 22, 2020

కరోనా వ్యాక్సిన్‌ను ఒకవేళ చైనానే ముందుగా అభివృద్ధి చేస్తే చైనాతో కలిసి పనిచేయడానికి కూడా సిద్దమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. à°“ విలేకరి à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు బదులుగా ట్రంప్ à°ˆ సమాధానమిచ్చారు. అమెరికాకు మంచి ఫలితం దక్కుతుందంటే ప్రపంచంలో ఎవరితోనైనా పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా పురోగతి సాధిస్తోందని.. అనుకున్న సమయం కంటే ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ అన్నారు. కాగా.. అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి ట్రంప్ చైనాపై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. చైనా వల్లే అమెరికాకు, ప్రపంచానికి ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయని.. చైనా ఇలా చేసి ఉండకూడదని ఆయన పలుమార్లు అంటూ వచ్చారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా చైనా ఆడినట్టు ఆడుతూ వచ్చిందని ఆరోపణలు చేశారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో నిత్యం 60 నుంచి 70 వేల కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 4,028,733 మంది కరోనా బారిన పడగా.. 144,958 మంది కరోనా కారణంగా మరణించారు