జబ్బుపడ్డ వృక్షాల కోసం అంబులెన్స్‌ వ్యవస్థ

Published: Thursday July 23, 2020

మనుషుల కోసం అంబులెన్స్ వ్యవస్థను చూశాం. అక్కడక్కడా జంతువులకూ ఉంటాయని చూశాం. కానీ పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తేవడం విన్నామా? మొక్కలకూ ప్రాణం ఉంటుందని జగదీశ్ చంద్రబోస్ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు.... స్పందన కూడా ఉంటుందని ప్రయోగాలతో సహా నిరూపించారు. అలా ఆయన చెప్పిన దానిని చండీగఢ్ అధికారులు అక్షరాలా, నమ్మకంగా తమ విశ్వాసంలోకి తెచ్చుకొని ఆచరించి చూపిస్తున్నారు.

 

జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ‘‘క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం à°ˆ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్)  వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాం. అలాంటి చెట్లను ప్రజలు గమనించినట్లయితే వాటి చికిత్స కోసం à°“ ప్రత్యేకమైన ఫోన్ నెంబరును కూడా అందుబాటులోకి తెచ్చాం. వాటి చికిత్స నిమిత్తం à°“ బృందాన్ని కూడా వెంటనే పంపుతాం’’ అని దేవేంద్ర దలై అన్న అధికారి ప్రకటించారు.