నిషేధాన్ని ఉపసంహరించాలంటూ భారత్‌కు చైనా హెచ్చరిక

Published: Tuesday July 28, 2020

 à°šà±ˆà°¨à±€à°¸à± యాప్‌లపై నిషేధం విధించడం చాలా తప్పు అని, ఉద్దేశపూర్వకంగానే à°ˆ తప్పు చేశారని, వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని భారత్‌కు చైనా హెచ్చరించింది. భారత దేశం చేసిన తప్పును సరిదిద్దు కోవాలని గట్టిగా చెప్పింది. చైనీస్ యాప్‌లను నిషేధించడంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఇది ఉద్దేశపూర్వక జోక్యమని, దీనిని సరిదిద్దుకోకపోతే, చైనా వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

 

చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిథి, కౌన్సెలర్ జి రోంగ్ విడుదల చేసిన ప్రకటనలో, ‘వుయ్‌చాట్’ యాప్‌ను నిషేదించడంపై భారత ప్రభుత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. వుయ్‌చాట్‌తోపాటు చైనీస్ నేపథ్యం ఉన్న 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిందన్నారు. దీనివల్ల చైనా కంపెనీల చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. దీనిపై దౌత్య సంబంధ అసంతృప్తిని వ్యక్తం చేశామని, à°ˆ తప్పును సరిదిద్దు కోవాలని భారత ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. 

 

భారత దేశంలోని అంతర్జాతీయ మదుపరుల హక్కులు, ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని చైనీస్ ఎంబసీ పేర్కొంది. 

 

భారత దేశ భద్రత, ప్రజల భద్రత, సమగ్రతలకు à°­à°‚à°—à°‚ కలిగించే కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు చైనీస్ మొబైల్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతంలో టిక్‌టాక్ సహా 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. తాజాగా వీటికి క్లోన్‌లుగా పని చేస్తున్న మరొక 47 యాప్‌లను నిషేదించింది. మొత్తం మీద 250 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. 

 

తాజాగా నిషేధించిన 47 యాప్‌à°² జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేయవలసి ఉంది. వీటిలో కొన్ని... టిక్ టాక్ లైట్, హెలో లైట్, షేర్ఇట్ లైట్, బిగో లైవ్ లైట్, వీఎఫ్‌వై లైట్ అని తెలుస్తోంది.