కరోనా మృతులకు పది లక్షల సాయం

Published: Wednesday July 29, 2020

రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నవారు బయటకు రావలసిన అవసరం లేకుండా.. నిత్యావసర సరుకులను వారి ఇళ్లకే పంపాలని రాష్ట్రప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలతో మంగళవారం ఆయన వీడియోను విడుదల చేశారు. ‘పరీక్షలు, క్వారంటైన్‌ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అక్కడ కనీస వసతులు లేవన్న ఫిర్యాదులు బాగా వస్తున్నాయి. అందువల్ల బాధితులు ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యేలా చేసి వారికి టెలిమెడిసిన్‌ ద్వారా ఆరోగ్య సలహాలు, సూచనలు ఇప్పించాలి. అత్యవసరం అనుకున్న వారినే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలి. రాష్ట్రప్రభుత్వం చనిపోయిన వారికి రూ.15 వేలిస్తోంది. వారి కుటుంబాలను నిలబెట్టడానికి అది చాలదు. రూ.పది లక్షల ఆర్ధిక సాయం అందించాలి’ అని కోరారు.

 

మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ‘కరోనా పరీక్ష కిట్లు, బ్లీచింగ్‌ పౌడర్‌, 104 అంబులెన్సుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి.. వాటినెలా వినియోగిస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. ప్రతి పౌరుడికీ రూ.పది లక్షల ఉచిత బీమా కల్పించాలని కోరారు. à°—à°¤ ఐదు రోజులుగా కరోనాపై రాష్ట్రమంతటా వర్చువల్‌ ఆందోళనలు జరిపి బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చామని.. ప్రజలకు టీడీపీ ఎప్పుడూ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని చెప్పారు.