మాట నిలబెట్టుకున్న మోదీ

Published: Thursday July 30, 2020

అయోధ్యలో రామజన్మభూమి వద్ద బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలిసి ఉన్న à°“ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌à°—à°¾ మారింది. 1991లో రామాలయ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తాను à°ˆ అరుదైన ఫోటోను తీసినట్టు స్థానిక ఫోటోగ్రాఫర్‌ మహేంద్ర త్రిపాఠి చెబుతున్నారు. అప్పట్లో రామజన్మభూమిని ఆనుకుని తనకు ఫోటో స్టూడియో ఉండేదనీ.. మోదీ ఇక్కడికి వచ్చిన సందర్భంగా తాను దీన్ని తీశానని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘మురళీ మనోహర్ జోషితో కలిసి 1991 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. అప్పట్లో వీహెచ్‌పీ తరపున ఫోటోగ్రాఫర్ నేను ఒక్కడినే. à°ˆ చారిత్రక ఫోటోలను తీసినందుకు గర్వంగా భావిస్తున్నాను..’’ అని త్రిపాఠి పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారనీ.. గుజరాత్‌ బీజేపీ నేత అంటూ మోదీని జోషి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.  ‘‘మళ్లీ అయోధ్య ఎప్పుడు వస్తారని మేమంతా మోదీని అడిగాం. ‘రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడు మళ్లీ వస్తాను..’ అని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రధాని à°† మాట నిలబెట్టుకుంటున్నారు...’’ అని త్రిపాఠి పేర్కొన్నారు. కాగా 1989 నుంచి తాను వీహెచ్‌పీ కోసం ఫోటోగ్రాఫర్‌à°—à°¾ పనిచేశాననీ.. తన ఫోటోలను అయోధ్య తీర్పులో కూడా పొందుపర్చారని అన్నారు. అయినా భూమి పూజ కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్ట్ తనను ఆహ్వానించలేదంటూ విచారం వ్యక్తం చేశారు.