ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

Published: Friday July 31, 2020

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఆగస్టు 5 న అయోధ్య రామ మందిర భూమి పూజను పురస్కరించుకొని ఈ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 5 న ఉదయం 11:15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకోనున్నారు. దాదాపు మూడు గంటలు అయోధ్యలోనే గడపనున్నారు. తిరిగి ఢిల్లీకి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనున్నారు.

 

మోదీ అయోధ్యకు చేరుకోగానే మొట్ట మొదట హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శించనున్నారు. à°† తర్వాత భూమి పూజకు బయల్దేరనున్నారు. మరోవైపు స్టేజీపై కేవలం ఐదుగురు మాత్రమే ఆసీనులు అవుతారని ట్రస్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబేన్ పటేల్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్, రామ మందిర ట్రస్టు చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మాత్రమే ఆసీనులు కానున్నారు.