2జీ టెలికం సేవలను ఎత్తివేయండి

Published: Friday July 31, 2020

దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2జీ టెలికం సేవలను దశల వారీగా ఎత్తివేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో కేవలం 4జీ సేవలను మాత్రమే అందిస్తోంది. త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే పనిలో ఉంది. దేశంలో మొబైల్ టెలిఫోనీ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన ‘దేశ్ à°•à±€ డిజిటల్ ఉడాన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ అంబానీ à°ˆ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని చాలామంది మొబైల్ ఖాతాదారులు ఇంకా 2జీ నెట్‌వర్క్‌లోనే చిక్కుకున్నారని పేర్కొన్నారు.  

 

‘‘దేశంలో ఇంకా 30 కోట్ల మంది మొబైల్ ఖాతాదారులు ఇంకా 2జీ నెట్‌వర్క్‌లోనే చిక్కుకుపోయారు. భారతదేశం సహా ఇతర దేశాలు కూడా ఫీచర్ ఫోన్లను ఇంటర్నెట్ ప్రాథమిక ఉపయోగాల నుంచి మినహాయించాయి. ప్రపంచం ఇప్పుడు 5జీ టెలిఫోనీ తలుపుల వద్ద నిలబడి ఉంది’’ అని ముకేశ్ అంబానీ వివరించారు.  

 

భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఆపరేటర్లు 3జీ నెట్‌వర్క్‌ను దశల వారీగా తొలగించినప్పటికీ వారి సబ్‌స్క్రైబర్ బేస్‌లో 2జీ యూజర్లు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు à°ˆ సంస్థలు ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నాయి. బకాయిలను భరిస్తున్నారు.

 

అతి తక్కువగా ఖర్చు చేసే యూజర్ల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు 4జీ అనుకూల ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టినప్పటికీ à°† రెండు కంపెనీల యూజర్లు వాయస్-ఓన్లీ ఖాతాదారులు మాత్రమే. వీరి వల్ల ఆయా కంపెనీలకు ఒరిగేదీమీ ఉండదు. ఇటీవల ఎయిర్‌టెల్ మాట్లాడుతూ.. పూర్తిగా 4జీకి మారడానికి కొంత సమయం పడుతుందని, 2జీ నెట్‌వర్క్‌ను మూసివేయాలన్న ఆతృత ఇప్పటికిప్పుడు లేదని స్పష్టం చేసింది.